ఇంగ్లాండ్ క్రికెట్ టీం లో అత్యంత ప్రతిభ కలిగిన ఆల్ రౌండర్ ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ ఒకరు. బెన్ స్టోక్స్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడే తన జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు . ఈయన తన అద్భుతమైన ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు . ఇక తన బ్యాట్ మరియు బాల్ తో రెండింటితో కూడా ప్రేక్షకులను అలరించిన ఈ గొప్ప ఆటగాడు మరికొన్ని రోజుల్లో రాబోయే "టీ 20" వరల్డ్ కప్ నుండి తప్పుకున్నట్లు అధికారికం గా ప్రకటించాడు.

అసలు విషయం లోకి వెళితే ... త్వరలో జరగనున్న "టీ 20" వరల్డ్ కప్ లో నేను ఆడను అని బెన్ స్టోక్స్ తాజాగా ప్రకటించాడు. ప్రస్తుతం నేను నా ఫిట్నెస్ మరియు శారీరక సామర్థ్యం బెటర్ చేసుకోవడం పై దృష్టి సారించాను. ఆల్ రౌండర్ గా 100 శాతం ప్రదర్శన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో భాగంగా "ఐ పీ ఎల్" మరియు "టీ 20"  వరల్డ్ కప్ మ్యాచ్ ల నుండి తప్పుకున్నట్లు ఈయన తాజాగా స్పష్టం చేశాడు.

ఇది ఇలా ఉంటే ఈయన తాజాగా "టీ 20" వరల్డ్ కప్ లో ఆడను అనే ప్రకటించడంతో ఇంగ్లాండు జట్టుకు ఇంత సామర్థ్యం కలిగిన ఆల్ రౌండర్ ప్లేయర్ దొరకడం కష్టమే అని దానితో వచ్చే "టీ 20" వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టుకు ఆల్ రౌండర్ విషయంలో భారీ కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఇక ఇంగ్లాండ్ జట్టు కూడా బెన్ స్టోక్స్ లాంటి గొప్ప ఆల్ రౌండర్ కోసం ఇప్పటి నుండే వెతికితే బాగుంటుంది అని కూడా పలువురు ఇంగ్లాండ్ జట్టుకు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bs