ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ టోర్నీ కోసం ఎంతలా ఎదురుచూస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వెస్టిండీస్ యుఎస్ వేదికలలో ఈ పొట్టి ప్రపంచ కప్ జరగబోతుంది. కాగా గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ వరకు ఒక్క ఓటమి లేకుండా దూసుకుపోయిన టీమ్ ఇండియా.. ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి అభిమానులను నిరాశపరిచింది. అయితే ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో మాత్రం ఇలాంటి తప్పులు చేయకుండా టైటిల్ గెలిచి విశ్వ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది.


 ఈ క్రమంలోనే అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు రెడీ అవుతుంది. కాగా ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ జరుగుతుండగా.. ఇక ఈ టోర్నీలో బాగా రాణించిన ఆటగాళ్లకు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా నుంచి ఎంతోమంది యువ ఆటగాళ్లు సీనియర్లు కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారు. దీంతో ప్రపంచ కప్ లో ఎవరిని జట్టులోకి ఎంపిక చేస్తారో అనే విషయంపై చర్చ జరుగుతుంది. అయితే ఇక భారత సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్ మరోసారి t20 వరల్డ్ కప్ లోకి వచ్చేలాగే కనిపిస్తూ ఉన్నాడు.


 ఎందుకంటే మొన్నటికి మొన్న ముంబై ఇండియన్స్ పై ఇక ఇటీవల సన్ రైజర్స్ పై మెరుపు ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు. అద్భుతమైన షాట్లతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. బెంగళూరు టీం ఓడిపోయిన దినేష్ కార్తీక్ మాత్రం తన బ్యాటింగ్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. దీంతో ఇలా సూపర్ ఫినిషర్ గా పేరు సంపాదించుకున్న దినేష్ కార్తీక్ ను t20 వరల్డ్ కప్ లో ఆడించాలని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కోరాడు. డీకే ఎక్కువగా ధోనితో పోటీ పడ్డారు. ధోని రెగ్యులర్ వికెట్ కీపర్ గా ఉండడంతో కార్తీక్ కి ఎక్కువగా అవకాశాలు రాలేదు. లేదంటే అతడి కెరియర్ మరోలా ఉండేది  ప్రస్తుతం ఆయన అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. టీమిండియా కు మ్యాచ్ విన్నర్ గా మారుతాడు. అందుకే టి20 వరల్డ్ కప్ లో ఎంపిక చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు అంబటి రాయుడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb