2024 ఐపీఎల్ సీజన్ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఊహించిన దానికంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అదిరి పోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. కొన్ని టీమ్స్ ప్రదర్శన విషయం లో ప్రేక్షకుల అంచనాలు తారుమారు అయ్యాయి. అంతంత మాత్రం మాత్రమే ప్రదర్శన చేస్తాయి అనుకున్న జట్లు అదిరిపోయే ప్రదర్శనతో టైటిల్ రేసులో ముందు ఉంటున్నాయి. ఇక తప్పకుండా టైటిల్ సాధిస్తాయి అనుకునే టీమ్స్ మాత్రం చివరికి టోర్నమెంట్ నుండి నిష్క్రమించే పరిస్థితి లో ఉన్నాయి.


 అయితే జట్టు గెలుపు ఓటమిలు ఎలా ఉన్నప్పటికి కొంత మంది ఆటగాళ్లు మాత్రం అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతున్నారు అని చెప్పాలి. ఇక అలాంటి ఆటగాళ్లలో సునీల్ నరైన్ కూడా ఒకరు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆటగాడు.. తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ బ్యాటింగ్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఒకరకంగా ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు అని చెప్పాలి.


 కోల్కతా జట్టు ఈ సీజన్లో వరుసగా మ్యాచులలో విజయం సాధిస్తూ వస్తుందంటే.. అందులో నరైన్ పాత్ర కీలకంగా ఉంది. అయితే ఇలా తన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సునీల్ నరైన్ పై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. నరైన్ ఈ సీజన్లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు అంటూ ప్రశంసించాడు. అతను ఒక్కసారి ఊపొందుకొని క్రీజులో కుదురుకుంటే చాలా ప్రమాదకరంగా మారతాడు అంటూ చెప్పుకొచ్చాడు. నా దృష్టిలో ఇప్పటివరకైతే సునీల్ నరైన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు అంటూ గ్రీన్ స్మిత్ ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: