
టోర్నీ ఫార్మాట్ & వేదికలు
WCL 2025 టోర్నమెంట్ జులై 18 నుంచి ఆగస్టు 2 వరకు ఇంగ్లాండ్‌లోని నాలుగు టాప్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), ది కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. లీగ్ దశలో మొత్తం 18 మ్యాచ్‌లు ఉంటాయి. ఆ తర్వాత సెమీ-ఫైనల్స్, గ్రాండ్ ఫైనల్ జరుగుతాయి. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి.
WCL 2025 పూర్తి షెడ్యూల్
ప్రారంభ మ్యాచ్: జులై 18న ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ (ఎడ్జ్‌బాస్టన్).
జులై 19: వెస్టిండీస్ vs సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా.
హై-వోల్టేజ్ మ్యాచ్: ఇండియా vs పాకిస్తాన్ - జూలై 20 (ఎడ్జ్‌బాస్టన్).
భారత్ ఆడే కీలక మ్యాచ్‌లు:
vs సౌత్ ఆఫ్రికా: జులై 22
vs ఆస్ట్రేలియా: జులై 26
vs ఇంగ్లాండ్: జులై 27
vs వెస్టిండీస్: జులై 29
నాకౌట్ స్టేజ్:
సెమీ-ఫైనల్స్: జులై 31 (ఎడ్జ్‌బాస్టన్)
గ్రాండ్ ఫైనల్: ఆగస్టు 2 (ఎడ్జ్‌బాస్టన్)
జట్ల బలాబలాలు
టీమిండియా: యువరాజ్ సేన
యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో శిఖర్ ధావన్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఉతప్ప, హర్భజన్ సింగ్ వంటి మ్యాచ్ విన్నర్లు బరిలోకి దిగుతున్నారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్, క్వాలిటీ స్పిన్, అనుభవజ్ఞులైన ఆల్‌రౌండర్లు ఇండియాకు అతిపెద్ద బలం.
పాకిస్తాన్: అఫ్రిది అగ్రెసివ్ గ్యాంగ్
షాహిద్ అఫ్రిది నాయకత్వంలోని పాక్ జట్టులో షోయబ్ మాలిక్, వహాబ్ రియాజ్, మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. పవర్‌ఫుల్ ఆల్‌రౌండర్లు, ప్రమాదకరమైన పేస్ ఎటాక్ వారి బలం.
ఆస్ట్రేలియా: ఆసీస్ పవర్
బ్రెట్ లీ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టులో నాథన్ కౌల్టర్-నైల్, షాన్ మార్ష్, టిమ్ పైన్, బ్రాడ్ హాడిన్ వంటి స్టార్స్ ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్, అగ్రెసివ్ బ్యాటింగ్ వీరి గేమ్ ప్లాన్.
ఇంగ్లాండ్: హోమ్ గ్రౌండ్ హీరోస్
కెవిన్ పీటర్సన్ నేతృత్వంలో ఇయాన్ బెల్, ఓవైస్ షా, మాంటీ పనేసర్, అలిస్టర్ కుక్ వంటి మేటి ఆటగాళ్లతో ఇంగ్లాండ్ పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై ఆడుతుండటం, అనుభవం వారికి కలిసొచ్చే అంశం.
సౌత్ ఆఫ్రికా: ఏబీడీ ఈజ్ బ్యాక్
ఏబీ డివిలియర్స్ రీఎంట్రీతో సౌతాఫ్రికా జట్టు బలంగా కనిపిస్తోంది. జాక్వెస్ కల్లిస్, హెర్షెల్ గిబ్స్, మోర్నే మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్ వంటి లెజెండ్స్ జట్టులో ఉన్నారు. అద్భుతమైన ఫీల్డింగ్, ఆల్‌రౌండ్ సత్తా వీరి బలం.
వెస్టిండీస్: సిక్సర్ల సునామీ
‘యూనివర్స్ బాస్’ క్రిస్ గేల్ కెప్టెన్సీలో డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్, డ్వేన్ స్మిత్ వంటి టీ20 స్పెషలిస్టులతో విండీస్ జట్టు నిండి ఉంది. వీరి హిట్టింగ్ పవర్ అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిది.
ఈ లీగ్ ఎందుకు మిస్ అవ్వొద్దంటే?
WCL 2025 కేవలం ఒక టోర్నమెంట్ కాదు, ఇది ఒక నాస్టాల్జియా. యువరాజ్ ఆన్-సైడ్ సిక్సర్లు, అఫ్రిది మెరుపు ఇన్నింగ్స్‌లు.. ఇలా మన ఫేవరెట్ స్టార్స్ ఆడిన ఆనాటి మ్యాజిక్‌ను మళ్లీ చూసేయొచ్చు. క్రికెట్ లవర్స్‌కు ఈ లీగ్ కచ్చితంగా ఒక ట్రీట్. ఆ వైరాన్ని, ఆ ఉత్సాహాన్ని మళ్లీ చూడటానికి సిద్ధంగా ఉండండి.