క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 28 వ వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆసియా కప్ టోర్నీ జరగబోతుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొనబోతున్నాయి. ఆ 8 జట్లను గ్రూప్ ఎ మరియు గ్రూప్ బి అనే  గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ లో భారత్ , పాకిస్తాన్ ,  యూఏఈ , ఒమన్ జట్లు ఉన్నాయి. గ్రూప్ బి లో బంగ్లాదేశ్ , శ్రీలంక , అఫ్గానిస్తాన్ , హాంకాంగ్ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూపు నుంచి మొదటగా నిలిచిన రెండు టీం లు సూపర్ ఫోర్ కి చేరుకుంటాయి.

ఇక్కడ టాప్ 2 లో నిలిచిన రెండు టీమ్ లు ఫైనల్ కు చేరుకుంటాయి. ఫైనల్ కు చేరిన రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ను సెప్టెంబర్ 28న దుబాయ్‌లో నిర్వహిస్తారు  ఇకపోతే ఆసియా కప్ టోర్నీలో ఎంతో మంది ఆత్రుతగా ఎదురు చూసే మ్యాచ్ లలో ఇండియా , పాకిస్తాన్ మ్యాచ్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇకపోతే సెప్టెంబర్ 14 వ తేదీన ఇండియా , పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ దుబాయ్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించిన  టికెట్లు Platinumlist.నెట్ లో ఆన్‌లైన్‌ లో లభిస్తున్నాయని ఎమిరేట్స్ క్రికెట్ అధికారికంగా ప్రకటించింది.

అయితే కేవలం ఇండియా మరియు పాకిస్తాన్  మ్యాచ్ కు సంబంధించిన టికెట్‌ను ప్రత్యేకంగా కొనడం అస్సలు వీలుకాదు. ఇది కేవలం 7 మ్యాచ్‌ల ప్యాకేజీ రూపంలో మాత్రమే లభిస్తుంది. ఆ ప్యాకేజీ ధర AED 1400 అనగా సుమారు 33,613 రూపాయలుగా ఉంటుంది. ఒక వేళ మీరు ఇండియా , పాకిస్తాన్ మ్యాచ్ చూడాలి అనుకుంటే ఈ ప్యాకేజీ మొత్తంగా తీసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: