ప్రస్తుత కాలంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల ఎక్కువవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్కొక్క ఇంటికి, ఒక్కో గ్యాస్ సిలిండర్ ఉపయోగించాలని ప్రభుత్వం సూచించినప్పటికీ,  ఒక్కో ఇంట్లో  2-3 గ్యాస్ సిలిండర్ల వినియోగం జరుగుతోంది. అయితే సామాన్యులకు ఇది చాలా ఇబ్బందిగా మారుతోంది. వినియోగదారులు ఎక్కువవడంతో గ్యాస్ సిలిండర్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. అయితే గ్యాస్ సిలిండర్ ధర పెరిగినప్పటికీ కూడా సబ్సిడీ వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఆ సబ్సిడీ ఎంత వస్తుందో?ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆధారంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. సబ్సిడీ డబ్బులను భారీగా తగ్గించేసింది. 2017 వ సంవత్సరం లో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సిలిండర్ కు ఏకంగా 563 రూపాయల సబ్సిడీ వచ్చేది. కానీ ఇప్పుడు సబ్సిడీ ఎంత వస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు.

డిసెంబర్ నెలలో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు 20 రూపాయలకు తగ్గిపోయింది. కానీ సిలిండర్ ధర మాత్రం రూ.700 దగ్గర ఉండేది. అంటే 2015 తో పోలిస్తే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు భారీగా తగ్గాయని చెప్పుకోవచ్చు. 2015 సంవత్సరంలో గ్యాస్ సిలిండర్ ధర 900 రూపాయలు ఉండగా, అందుకు తగ్గట్టు సబ్సిడీ 300 నుంచి 400 రూపాయల సబ్సిడీ వచ్చేది. అయితే గతేడాది డిసెంబర్లో సిలిండర్ ధర 700 వద్ద ఉండడం కారణంగా సబ్సిడీ డబ్బులను బాగా తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 810 రూపాయలు ఉండగా, దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీ డబ్బులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే.  దేశంలో మొత్తం 28 కోట్ల ఎల్పిజి సిలిండర్ వినియోగదారులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా 2021 - 2022 బడ్జెట్లో గ్యాస్ సబ్సిడీ డబ్బులు కేటాయింపులను గణనీయంగా తగ్గించింది. రూ.  12,995 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్ తో పోల్చుకుంటే ఈ కేటాయింపులురూ.40 వేల కోట్లకు పైమాటే.  అంటే కేంద్రం సబ్సిడీ నిధులను కూడా తగ్గించేసిందని గుర్తుంచాలి. ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో ఎల్పిజి సిలిండర్ బుక్ చేసే వారికి, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 45 రూపాయలు పడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: