తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ కొరియోగ్రఫర్స్‌లో జానీ మాస్టర్ కూడా ఒకరు. రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలకు కూడా ఈయన కొరియోగ్రఫీ చేసారు. ఈయన చిన్నప్పటి నుండి చాలా కష్టపడి కూలీగా, లారీ డ్రైవర్‌గా పనిచేసిన జానీ మాస్టర్ 2009లో ద్రోణ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా కెరియర్ మొదలుపెట్టారు. అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తు స్టార్ హీరోలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించి పేరు సంపాదించారు. ఇదిలా ఉంటే.. లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాంలో అనసూయ విశ్వరూపం చూపిస్తోంది. ముఖ్యంగా ఈ షోలో అనసూయ ఒక రేంజులో రెచ్చిపోతుందనే చెప్పాలి.
అయితే ఇదే షోలో మరో జడ్జిగా వ్యవహరిస్తున్న టాలివుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మాత్రం అనసూయ పెర్ఫార్మెన్స్ కు ఒక రేంజిలో ఫిదా అవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే.. అనసూయ ఇంతకు ముందు వేరే చానెల్స్ లో అనసూయ డాన్స్ లు చేసేది. అయితే అవి కేవలం కొద్దిగా చిన్న చిన్న స్టెప్పులకు మాత్రమే పరిమితం అయ్యేవి. అయితే లోకల్ గ్యాంగ్స్ లో మాత్రం అనసూయ ఫుల్ స్వింగులో డ్యాన్స్ చేస్తోంది. దీంతో జానీ మాస్టర్ తనతో పాటు స్టెప్పులు వేస్తున్న అనసూయ డ్యాన్సును పొగడకుండా ఉండలేకపోతున్నాడు. ఇక తాజాగా ఈ ప్రోగ్రాం నుంచి విడుదలైన ప్రోమోలో అనసూయ డ్యాన్స్‌తో ఓ ఊపు ఊపేసింది.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో పాటకు అనసూయ సెప్పులు అదిరిపోయాయనే చెప్పాలి. ముఖ్యంగా జానీ మాస్టర్ అయితే ఏకంగా అనసూయ కొంగు చాటులో తలపెట్టి మరీ డ్యాన్సులో లీనమయ్యాడు.ఈ అనుకోని పరిణామంతో అనసూయ కాస్త తటపటాయించినప్పటికీ.. జానీ మాస్టర్ తో కలిసి స్టెప్పులు వేస్తూ మళ్లీ డ్యాన్సులో ఫుల్ స్వింగులోకి వెళ్లిపోయింది. కాగా, జిగేలు రాణి, సినిమా చూపిస్తా మామా, లైలా ఓలైలా, మీ తాత టెంపర్, కమ్ టు ద పార్టీ, పిల్లా నువ్వు లేని జీవితం, వంటి బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులను ఇచ్చి టాప్ కొరియోగ్రాఫర్ అనిపించుకున్నారు జానీ.