అయితే క్యాష్ షోలో ఎంట్రీ ఇచ్చేటప్పుడు సెలెబ్రిటీలకు ఏదైనా తినుబండారాలను ఇస్తున్న సంగతి అందరికి తెల్సిన విదితమే. అయితే ఈసారి పులిహోరను ఏర్పాటు చేశారు. దీంతో అందరూ కలిసి శేఖర్ మాస్టర్‌ను ఓ ఆట ఆడుకున్నారు. సుమతో మొదలుపెట్టిన ఈ బాదుడు.. హైపర్ ఆదితో ముగిస్తారు. అయితే షోలోకి ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్‌కు పులిహోర అందించింది సుమ. ‘ఈ పులిహోర మిర్చి ఎందుకు వేశారు?‘ అని శేఖర్ మాస్టర్ అనడంతో.. ‘మీరు కలిపే పులిహోరలో మిర్చి ఉండదా?' అని సుమ ఓ పంచ్ వేసింది. ఇక ఇలా మొదలైన దాడి అలా కొనసాగుతూనే వస్తుంది.
అంతేకాక వెంటనే వచ్చిన రష్మీకి సుమ పులిహోర అందించింది. ఎవరు చేశారు అని రష్మీ అడగంతో.. వారు కలిపారు అంటూ శేఖర్ మాస్టర్‌ను చూపించింది. ‘మాస్టర్ మీరు కలిపారంటూ ఓ రకంగా ఆడిగింది రష్మీ. అనసూయ ఎంట్రీ ఇవ్వగా.. ఫస్ట్ ఆ పులిహోర తీసుకో అని సుమ అంటుంది. ‘అప్పుడే కలిపేశారా? మాస్టర్' అంటూ శేఖర్ మాస్టర్ పరువు తీసింది.
అంతేకాదు చివరికి వచ్చిన హైపర్ ఆది పులిహోరను చూస్తూ.. ‘శేఖర్ మాస్టర్ కలిపాక కూడా మిగిలిందా?' అని పంచ్ వేస్తాడు. ఇక ఇదే సమయంలో శేఖర్ మాస్టర్‌ను చూపిస్తూ రాజా సినిమా బ్యాక్ గ్రౌండ్, వెంకటేష్ డైలాగ్‌లతో( అదంతా అప్పుడండి.. ఇప్పుడు నేను మారిపోయానండి అంటూ వేసిన ఎడిటింగ్ అదిరిపోయింది. ఇలా అందరూ కలిసి శేఖర్ మాస్టర్‌ను పులిహోరకు అంకితం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి