ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 3 ని ప్రేక్షకులు ఎప్పుడు మర్చిపోరు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేత గా నిలిచిన ఈ షో లో కంటస్టెంట్ లు అందరు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. కంటస్టెంట్ల మధ్య కూడా బంధం అలాగే కొనసాగుతూ ఉంది. కొందర ప్రాణ స్నేహితుల్లా ఉంటే.. ఇంకొందరు తోబుట్టువుల్లా కలిసి ఉంటారు. అలాంటి వారిలో శివజ్యోతి, రవికృష్ణ, అలీ రెజా ఉన్నారు. ఈ ముగ్గురు బిగ్ బాస్ షోలో చేసిన సందడి, వారి అనుబంధాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శివజ్యోతి, రోహిణి, అషూ, రవికృష్ణ, అలీ రెజా ఇలా అందరూ ఓ గ్యాంగ్‌లా కలిసి రచ్చ చేశారు. అయితే ఇందులో రోహిణి, అషూ మాత్రం త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. అలీ రెజా కూడా త్వరగానే ఎలిమినేట్ అయినా మళ్లీ రీఎంట్రీలో వచ్చి అదరగొట్టేశాడు. బిగ్ బాస్ ఇంట్లో ఎలిమినేషన్స్ జరిగితే ఆ రోజంతా ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది.
కొందరు కంటెస్టెంట్లు సాధారణంగా రియాక్ట్ అవుతుంటారు. ఇంకొందరు ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటారు. అలా అలీ రెజా, రవికృష్ణ ఎలిమినేట్ అయిన సమయంలో శివజ్యోతి ఓ రేంజ్‌లో ఏడ్చేసింది. పాతాళగంగను తలిపించిందంటూ ఆమెపై విపరీతమైన ట్రోల్ జరిగేది. ఇదిలా ఉంటే మనం ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా కూడా మన ఇద్దరి ఆత్మలు ఒకటే అని నేను నమ్ముతున్నాను. హ్యాపీ బర్త్ డే అక్కా.. నీకు మరింత సంతోషాలు రావాలని కోరుకుంటున్నాను.. విజయాలు దక్కాలని కూడా కోరుకుంటున్నాను.. అంతే కాకుండా త్వరలోనే ఓ బేబీ వస్తుందని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు అలీ రెజా. అంటే శివజ్యోతి త్వరలోనే తల్లి కాబోతోందని అర్థమవుతోంది. ఓ ఇళ్లు, ఓ కారు కొనుక్కుంది. ఇప్పుడు ఇక తల్లి కూడా కాబోతోంది. మొత్తానికి శివజ్యోతి ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి