కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న నిరుపమ్ భార్య మంజుల పరిటాల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె కూడా సీరియల్ నటిగా ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఈమె  కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జన్మించారు. ఈమె తల్లి హౌజ్ వైఫ్ కాగా, తండ్రి హెడ్ కానిస్టేబుల్ గా చేసేవారట. బీ కాం చదివిన ఆమె కు ఒక అక్క, చెల్లి కూడా ఉన్నారు. అక్క పేరు చంద్రకళ కాగా, చెల్లి పేరు కీర్తి. బాలనటిగా కొన్ని కన్నడ సీరియల్స్ లో నటించడంతో పాటు తెలుగు లో పలు సీరియల్స్ లో కూడా నటించారు.

మంజుల ఇంటర్ చదువుతున్న సమయంలో ఆమె నాన్న స్నేహితుడు ఒక సీరియల్ హీరోయిన్ కోసం వెతుకుతుండగా ఆ సీరియల్ ఆడిషన్స్ కి వెళ్లారు. అక్కడ ఆమెను చూసిన సీరియల్ యూనిట్ సభ్యులు ఆమెను హీరోయిన్ గా ఎంచుకున్నారు. అయితే అప్పటివరకు మంజులకు నటిగా అనుభవం లేదు దీంతో ఆ సీరియల్ నిర్మాతలే ఆమెకు ఏ విధంగా నటించాలో ట్రైనింగ్ ఇచ్చారు.  చదువు కొనసాగిస్తూనే ఏకంగా అయిదు కన్నడ సీరియల్స్ లో నటించిన ఆమె టాలెంట్ సులభంగానే అర్థం అవుతుంది. 

ఆ తర్వాత తెలుగు సీరియల్ చంద్రముఖి లో ఛాన్స్ దక్కించుకున్న మంజుల ఈ సీరియల్ షూటింగ్ సమయంలోనే నిరుపమ్ తో ప్రేమలో పడ్డారు. ఆ తరుత వీరీ ప్రేమ పెళ్లికి దారితీసింది. అన్ని తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో సీరియల్స్ చేశారు ఈమె. ఈ దంపతులకు అక్షరాజ్ అనే కొడుకు ఉన్నాడు. చంద్రముఖి సీరియల్ కు గాను ఆమెకు నాలుగు అవార్డులు రాగా కాంచన గంగ సీరియల్ లోని పాత్రకు మంచి పురస్కారం దక్కింది. కొన్ని తెలుగు సీరియల్స్ లలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తూ నటిగా మంజుల తన సత్తా చాటుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: