తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది బిగ్ బాస్ రియాలిటీ షో. సరికొత్త టాస్క్ లతో మరింత హుషారు పెంచుతూ ఇంటి సభ్యులతో ఎక్స్పరిమెంట్స్ చేయిస్తూ ఆడియన్స్ కి మరింత ఆసక్తిని పెంచుతున్నారు బిగ్ బాస్. షో మొదలయ్యి రెండు వారాలై పోయింది, ఇప్పుడు మూడో వారంలో అడుగుపెట్టింది. ఇప్పటికే సరయు, ఉమాదేవి అనే ఇద్దరు కంటిస్టెంట్లు ఎలిమినేట్ కూడా అయిపోయారు. షో ఎంతగా ప్రేక్షకాదరణ పొందుతుంది అంటే రేటింగ్ ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. మొదటి వారం లో సిరి ఇంటి కెప్టెన్ కాగా రెండవ వారంలో విశ్వ ఇంటి కెప్టెన్ అయ్యాడు. సిరి కెప్టెన్సీలో హౌస్మేట్స్ పెద్దగా ఇబ్బంది పడింది లేదు. అయితే విశ్వ మాత్రం బిగ్ బాస్ హౌజ్ రూల్స్ బ్రేక్ చేస్తే దూల తీర్చేస్తుస్తున్నాడు.

తాజా ప్రోమో రిలీజ్ కాగా అందులో ఏముందంటే. షణ్ముక్ టైం కు మించి నిద్ర పోతూ ఉండడంతో అది గుర్తు చేసి అలర్ట్ చేసేందుకు హౌస్ లో కుక్క అరుపులు వినిపించాయి. ఆ అరుపులు విని షణ్ముక్ వెంటనే లేచి కూర్చున్నాడు. అయితే విశ్వ.. షణ్ముక్ కి హౌజ్ రూల్ బ్రేక్ చేసిన కారణంగా వేసిన శిక్ష కాస్త కటువుగానే అనిపించింది. 21 సార్లు స్విమ్మింగ్ పూల్ లో మునిగి రావాలంటూ కెప్టెన్ గా షణ్ముక్ కి ఆర్డర్ వేశాడు విశ్వ. షణ్ముక్ ఏమి వాదించకుండానే  పనిష్మెంట్ స్వీకరించి స్విమ్మింగ్ పూల్ లో దూకడం మొదలుపెట్టాడు. ఇక్కడ విశ్వ బిహేవియర్ చూసి ఇంటి సభ్యులు ఆశ్చర్యపోయారు. మరి ఇంత వైలెంట్ గా ఉండకూడదు అని చర్చించుకుంటున్నారు.

అయినా షణ్ముక్ పర్ఫామెన్స్ చూసి ఈసారి హౌజ్ లో ఫ్రూట్ తనేనంటు కామెంట్ చేస్తున్నారు. పెద్దగా మాట్లాడడు, కోపాన్ని చూపించడు, ఫీలింగ్స్ ని అస్సలు బయటపెట్టాడు. ఎవరు ఏమన్నా సైలెంట్ గా తలదించు పోతుంటారు షణ్ముక్. మరి ఇంతకీ విశ్వ కి ఎవరైనా అడ్డు చెప్పారా.. షణ్ముఖం పనిష్మెంట్ కంప్లీట్ చేశాడా.. లేదా..? ఇంకా ఏమేమి జరగనుంది అనేది ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: