స్టార్ మా లో ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.. ఈ సీరియల్ లో ప్రతి నటీనటులు కూడా ప్రేక్షకులను ఎంతో బాగా అలరిస్తున్నారు. జానకి కలగనలేదు సీరియల్ హిందీలో డబ్ అయిన ఈ తరం ఇల్లాలు సీక్వెల్ అని అందరికీ తెలిసిన విషయమే.ఇకపోతే ఏ సీరియల్ లో రామా పాత్రలో నటిస్తున్న హీరో గురించి, అతను రియల్ లైఫ్ స్టోరీ గురించి మనం తెలుసుకుందాం..

జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ రామచంద్ర అసలు పేరు అమర్దీప్ చౌదరి. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జన్మించారు. అమర్దీప్ చౌదరి స్కూలింగ్ అలాగే కాలేజ్ కూడా అనంతపురం లోనే పూర్తి చేశాడు. అనంతపూర్ లోని బీటెక్ పూర్తి చేసి కొన్ని రోజుల పాటు ఉద్యోగం కూడా చేశాడు. ఇక అమర్దీప్ చౌదరి కి నటన మీద ఆసక్తి చిన్నప్పటినుంచే ఉంది.. దానికి తోడు చూడడానికి హీరో కటౌట్.. మంచి హైట్ కలర్ ఉండడంతో ఈయన కుటుంబ సభ్యులతోపాటు కాలేజ్ లో తోటి స్నేహితులు కూడా సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారట.. ఇక అమర్ దీప్.. స్నేహితుల సహకారం..కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు..

ఇక ఈయన ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఇక ఇతని తల్లిదండ్రులు ఇద్దరూ కూచిపూడి డాన్సర్స్. తల్లిదండ్రులిద్దరూ కూచిపూడి డాన్సర్ కావడంవల్ల అమర్దీప్ చౌదరి కూడా మంచి డాన్సర్ గా గుర్తింపు పొంది పలురకాల షో లలో పర్ఫామెన్స్ కూడా ఇచ్చాడు. అంతేకాదు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు అమర్దీప్.. అమర్దీప్ కూడా మొదట చిన్న చిన్న షార్ట్ ఫిలింస్ లో నటించి ఆతర్వాత సన్నిహితుల సహకారం తో బుల్లి తెరపై ప్రవేశించాడు. మొదటి సారి స్టార్ మా లో ప్రసారమైన సిరిసిరిమువ్వలు అనే సీరియల్ ద్వారా బుల్లితెర పై అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించి, ఇక బుల్లితెరపై అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు, ఉయ్యాల జంపాల వంటి సీరియల్స్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్దీప్ ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ తో మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: