బిగ్ బాస్ ఫో తర్వాత ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్ లో కరాటే కళ్యాణి తన ప్రేమ పెళ్లి గురించి మాట్లాడడం జరిగింది. తనని ప్రేమ పేరుతో వాడుకున్నారని నిజమైన ప్రేమ తనకి ఎక్కడ లభించలేదని.. కేవలం అమ్మ అనే పేరు పిలిపించుకోవడానికి రెండుసార్లు వివాహం చేసుకున్నానని కరాటే కళ్యాణి తెలియజేసింది. రాబోయే రోజుల్లో తను వివాహం చేసుకుంటానో లేదో తెలియదు అంటూ ఎన్నోమాటలను తెలియజేసింది.. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. కేవలం భార్య అంటే వండి పెట్టాలి.. ఇంట్లోనే అనిగిమనిగి ఉండాలి.. ఏం మాట్లాడకూడదు అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు.. కానీ నేను అలాంటి దాన్ని కాదు ఫైర్ లాంటి దాన్ని అని తెలియజేసింది. తను ప్రేమించిన వ్యక్తి మంచి వ్యక్తి అనుకోని మోసపోయాను అని తెలియజేసింది. ఇక తనని వివాహం చేసుకున్న తర్వాత ఆ  వ్యక్తి ఇంట్లోనే ఉండి తన కుమారుడికి వండి పెట్టు అని అంటూ ఉండేవాడు అని తెలియజేసింది. కానీ అవి తనకి నచ్చకపోవడంతో విడాకులు ఇచ్చేశానని తెలియజేసింది. ప్రస్తుతం తనకు నచ్చినట్లుగా హ్యాపీ లైఫ్ లో ఉన్నానని తెలియజేసింది.


తనకు ఎటువంటి విభేదాలు లేవని.. కేవలం తన భర్త వల్లే ఇలా ఎన్నో కష్టాలు పడ్డాను.. తన భర్త తాగి వచ్చి కొట్టడం వంటివి చేసేవాడిని, పైగా అనుమానంతో కొట్టేవాడని ఈమె అలాంటివి భరించలేక మరో భర్తను  కూడా వదిలేశాను అని తెలియజేసింది. తను సినిమా ఇండస్ట్రీలో కాని బయట ప్రపంచంతో కానీ ఎవరి తో మాట్లాడే దానిని కాదని తెలియజేసింది.. జనాలకు ఇలాంటివి ఏ విషయాలు తెలియవని కానీ వాళ్లే నాకు అన్నం పెట్టారని తెలియజేసింది. తను పడిన కష్టం ఏ ఆడది పడకూడదని తెలియజేసింది. ఒకానొక సమయంలో ఇలాంటి కష్టాలు భరించలేక చని పోదాం అనుకున్నాను అని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి.. కేవలం తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే కొన్నిసార్లు నిద్ర మాత్రలు కూడా మింగానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: