ప్రస్తుతం మా టీవీ లో ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు అయిదు సీజన్ లు పూర్తి చేసుకుని ఆరవ సీజన్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ షో వలన ఎంత వినోదం పంచుతుందో... కొన్ని సార్లు అంతే వివాదాల పాలు అవుతోంది. ఈ మధ్యనే ఈ షోను నిలిపివేయాలని కోర్ట్ లో కేసు కూడా ఫైల్ అయింది. కానీ కేసు క్లోజ్ అయ్యేలోపు ఇంకా చాలా సీజన్ లు పూర్తి అవ్వడం ఖాయం. కాగా బిగ్ బాస్ సీజన్ 6 మొత్తం మంది 21 సభ్యులతో మొదలు కాగా, ప్రస్తుతం ఇంట్లో కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు సానీ, అభినయశ్రీ, నేహా మరియు ఆరోహిలు ఇంటిని వదిలి వెళ్లిపోయారు.

అయితే ఈ నాలుగు నామినేషన్ లు కూడా వారు ఆటను సరిగా ఆడకపోవడం వలెనే అన్నది ప్రేక్షకులకు మరియు ఇంట్లో సభ్యులకు తెలుసు. ఇక ఆరోహి వెళ్తున్నప్పుడు అప్పటి వరకు చిలకా గోరింకల్లా ఉన్న సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతే కాకుండా వీరిద్దరి మధ్య ఏముందా అంటూ టెన్షన్ పడిన జనాలు సైతం ఆరోజు క్లారిటీ తెచ్చుకున్నారు. సూర్య తన మనసులోని మాటను కూడా బయటపెట్టడం విశేషం... ఆరోహిని చూసి లవ్ యు అంటూ అసలు విషయం చెప్పేశాడు. దీనితో ఆరోహి కి సూర్యకు మధ్య ఉన్న విషయం ఏమిటో తెలిసింది.

అయితే ఆరోహి వెళ్లిన తర్వాత ఒంటరి అయిపోయిన సూర్య తన గేమ్ తాను ఆడుకుంటూ ఉన్నాడు. కానీ ఈ వారంలో చూస్తే... ఇనయ సుల్తానా తనపై ప్రేమను పెంచుకుందని డైరెక్ట్ గా బిగ్ బాస్ తోనే చెప్పడంతో షాక్ అవ్వడం అందరి వంతయింది. అయితే తెలుస్తున్న ప్రకారం ఇనాయకు సూర్య అంటే మొదటి నుండి ఇష్టం అట... ఆరోహి తో అలా ఉన్నప్పుడు చాలా బాధపడిందట. మరి ఇనయ ప్రేమను సూర్య ఒప్పుకుంటాడా లేదా అన్నది రానున్న రోజుల్లో తెలియనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: