
అప్పుడప్పుడు హైపర్ ఆది వేసేటువంటి పంచ్ డైలాగుల వల్ల పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఆది క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. జబర్దస్త్ కార్యక్రమం నుండి ఇటీవల హైపర్ ఆది తప్పుకున్నారనే విషయం వైరల్ గా మారింది.. గతంలో కూడా హైపర్ ఆది ఒకసారి ఇలానే తప్పుకొని మళ్ళీ రీ యంట్రి ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం వచ్చే ఆలోచనలో లేరన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఆరు నెలలు కావస్తున్న తిరిగి జబర్దస్త్ లో కనిపించలేదు
కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షో లో మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. కానీ జబర్దస్త్ నుంచి తప్పుకున్నారని ప్రచారం మాత్రం ఎక్కువగా జరుగుతోంది. హైపర్ ఆది కేవలం సినిమాలలో బిజీగా ఉండడం వల్లే జబర్దస్త్కు గుడ్ బై చెప్పారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హైపర్ ఆది స్టార్ హీరోల సినిమాలలో కనిపిస్తున్నారు. హైపర్ ఆది షోలలోనే కాకుండా సినిమాలలో నటించాలనే ఉద్దేశంతో పలు చిత్రాలకు ఓకే చెబుతూ ఉన్నారు. దీంతో జబర్దస్త్ స్క్రిప్ట్ రాయడానికి టైం సరిపోలేదని ఆది సన్నిహితుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే హైపర్ ఆది కాస్త దూరంగా ఉంటున్నారు అనే వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయాన్ని హైపర్ ఆది తెలియ చేస్తారేమో చూడాలి.