సాధారణంగా సమయం బాగోలేకపోతే బిచ్చగాడితో కూడా మాటలు పడాల్సిన సమయం వస్తూ ఉంటుంది.  ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు మనం చేసే పనులు కూడా అవతలి వాళ్లను నవ్వించే విధంగా మనల్ని మనం అవమానపరుచుకునే విధంగా కూడా ఉంటాయి.  కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు.  ఇకపోతే తాజాగా యాంకర్ సుమ పని కూడా ఇప్పుడు అలాగే అయిపోయింది. దాంతో తన ఇంట్లోనే తనకు మర్యాద లేదంటూ ఆవేదన చెందుతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇంతకు అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమ స్టార్ నటీనటులు ఉన్నా సరే తన క్రేజ్ తనకే సొంతమని చెప్పాలి.  విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్న ఈమె ఏ షోలో చేసిన సరే ఆ షో కచ్చితంగా సక్సెస్ అవుతుంది. అంతేకాదు ఏకంగా స్టార్ హీరోయిన్ సమంత కూడా సుమాతో యాంకరింగ్ విషయంలో మీరు ఉంటే మేము కంఫర్ట్ గా ఫీల్ అవుతాము అని చెప్పిందంటే ఇక సుమ యాంకరింగ్ సెలబ్రిటీలు కూడా ఎంతలా ఇష్టపడతారో అర్థం చేసుకోవచ్చు.

అంతేకాకుండా అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై ఆల్ రౌండర్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.  ఎన్నో సంవత్సరాలుగా యాంకరింగ్ చేస్తూ సీనియర్ స్టార్ యాంకర్ గా పేరు ప్రఖ్యాతలు గడిచింది. పేరు తెచ్చుకోవడమే కాదు తన హోస్టింగ్ తో అందరినీ అలరిస్తూ నవ్విస్తూ ఉంటుంది.  సుమా మాటలు వింటే ఎంతటి వారైనా సరే కరగాల్సిందే. ముఖ్యంగా ఆమె మాట్లాడే విధానం అందరినీ ఆకర్షిస్తుంది. అసలు విషయంలోకి వెళితే తాజాగా ఒక వీడియోని షేర్ చేస్తూ ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యాని అంటూ వంట చేస్తున్న వీడియో తీస్తూ కనిపించింది సుమ.

ఇక ఆ వీడియోలో తాను తయారుచేసిన ఫుడ్ గురించి చెబుతూ ఉంటే తన ఇంట్లో పనిచేసే వాళ్లు సుమా పరువు తీసే విధంగా నవ్వడం మొదలుపెట్టారు. ఏమైందో తెలియదు కానీ సుమ మాటలకు మాత్రం వారు నవ్వినట్లు కనిపించగా.. సుమా కాస్త ఆశ్చర్యపోయి ఇంట్లో నా వ్లోగ్ కి మర్యాద లేకుండా పోయింది అంటూ ఫీల్ అవుతూ కనిపించింది.  మొత్తానికి అయితే ఈ వీడియో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: