టీవీ9 మళ్లీ నెంబర్ వన్ పొజిషన్‌లోకి వచ్చింది. వార్త ప్రపంచంలో టీవీ9 కు ఏ ఛానల్ సాటి లేదని నిరూపించింది. అప్పట్లో జెమినీ టీవీ మొదటి స్థానంలో ఉండేది. మాటీవీ రెండవ స్థానంలో ఉండేది. ఆ మధ్యలో ఒకసారి టీవీ9 రెండో స్థానానికి  చేరుకుంది. తర్వాత ఒకసారి ఎన్ టీవీ  తమ సత్తాను చాటుతూ మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంతో టీవీ9 సరిపెట్టుకుంది.


ఆ తర్వాత ఎన్ టీవీ మొదటి స్థానంలో ఉంటే టీవీ9 చాలా ఏళ్ల పాటు రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. తాజాగా వెలువడినటువంటి సర్వేలో టీవీ 9 వార్త ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచినట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు టీవీ5 మొదటి స్థానంలో ఉండగా టీవీ9 రెండో స్థానంతో సరిపెట్టుకుంది. తర్వాత ఎన్ టీవీ v6 ఛానల్ తమ సత్తాను చాటుతూ ఆయా స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు సీన్ మారింది ప్రస్తుతం టీవీ 9 మొదటి స్థానంలో కి వచ్చింది.


ప్రస్తుతం ఎన్టీవీ రెండవ స్థానం టీవీ5 మూడో స్థానం వి6 నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. గతంలో టీ న్యూస్ నమస్తే తెలంగాణ ఛానల్ బీఆర్ఎస్ పార్టీకి అప్పటి టిఆర్ఎస్ అనుకూలంగా వార్తలు రాస్తూ ప్రజల్లోకి తెలంగాణ వాదాన్ని తీసుకెళ్లడం ద్వారా చాలా పాపులారిటీ సంపాదించింది.


అదే విధంగా జగన్ కు సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ రెండు కలిసి వైసీపీకి మద్దతుగా టీడీపీ కి వ్యతిరేకంగా చేసిన ప్రచారంలో సక్సెస్ అయి తమ సత్తా చాటుకుంది. అయితే టీవీ9 ప్రస్తుతం తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి కి అనుకూలంగా వార్తలు ప్రసారం చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగానే టీవీ9 పై చర్యలు తీసుకుంటామని ఆయన బహిరంగంగానే ప్రకటించినట్లు సమాచారం. ఏదేమైనా టీవీ9 మొదటి స్థానంలో నిలవడంతో ఆ ఛానల్ ప్రతినిధులు జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: