తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హైపర్ ఆది గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షోలో తనదైన కామెడీ పంచులతో బాగా అలరించిన హైపర్ ఆది వెండితెర పైన పలు సినిమాలలో కూడా కమెడియన్గా నటిస్తూ మంచి పాపులారిటీ అందుకున్నారు.. ప్రస్తుతం జబర్దస్త్ మానేసి ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇతరత్రా పండుగ ఈవెంట్లకు సైతం సందడి చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. బుల్లితెరపై సుదీర్ తర్వాత అంతటి క్రేజీ అందుకున్న కమెడియన్ గా పేరు సంపాదించారు.

రాజకీయ నాయకుడిగా కూడా ఇటీవలే జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే హైపర్ ఆదికి 40 ఏళ్లు దాటిన ఇంకా వివాహం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు హైపర్ ఆది వివాహం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు దీంతో హైపర్ ఆది వివాహం చేసుకుంటారా లేదా అని అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. ముఖ్యంగా హైపర్ ఆది జాతకంలో దోషం ఉందంటూ ఆ దోషం పోవాలి అంటే ఒక జ్యోతిష్యుడు ఒక ఉపాయాన్ని సైతం తెలియజేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


అదేమిటంటే హైపర్ ఆది ఒక వృద్ధురాలిని వివాహం చేసుకోవలసి ఉంటుందని ముసలావిడని పెళ్లి చేసుకున్న తర్వాతే మళ్ళీ అమ్మాయిని వివాహం చేసుకోవాలని జ్యోతిష్యులు చెప్పడంతో హైపర్ ఆది కంగుతిన్నట్లుగా తెలుస్తోంది.. అయితే ఇదంతా కేవలం స్కిట్లు భాగంగానే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ స్కిట్ చేసినట్లుగా కనిపిస్తోంది. తాగుబోతు రమేష్ ఇందులో బాబాగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా హైపర్ ఆది సైతం రష్మిక పైన పంచులు వేయడం జరుగుతోంది. సరదా సరదాగా ఈ స్కిట్ సాగే లాగా కనిపిస్తోంది. చాలామంది సీనియర్ భామలను తీసుకువచ్చి ఈ షోలో గెస్ట్లుగా చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా కోటబొమ్మాలి సినిమాలోని పాట డాన్స్ వేస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి హైలెట్గా నిలిచాడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: