హీరోగా మంచి సక్సెస్ అందుకున్న బాలయ్య.. హోస్టుగా మొట్టమొదటిసారి ఆహా ఓటిటీ సంస్థ బాలయ్య టాలెంట్ ను గుర్తించి బాలయ్యతో అన్ స్టాపబుల్ అనే షోని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమానికి బాలయ్య తన మాట తీరుతో మంచి సక్సెస్ ని అందుకునేలా చేశారు.. ఆహా షోలో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది.. ఈ మూడు సీజన్ లో ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలు కూడా ఇందులో పాల్గొని తమకు సంబంధించిన విషయాలను కూడా తెలియజేశారు. అలాగే పలువురు రాజకీయ నాయకులు కూడా ఇందులో సందడి చేయడం జరిగింది.


ఇలా స్టార్ సెలబ్రెటీలు అందర్నీ కూడా బాలయ్య ప్రశ్నల వేస్తూ వారి గురించి పలు విషయాలను అటు అభిమానులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో నాలుగో సీజన్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ సీజన్-4 త్వరలోనే ప్రారంభం కాబోతోంది అంటూ ఇటీవలే ఆహా కూడా అధికారికంగా వెల్లడించడం జరిగింది.. అన్ స్టాపబుల్ సీజన్ 4 కార్యక్రమం లో భాగంగా కొంత మంది సెలబ్రిటీలు కూడా ఇందులో పాల్గొనేలా ఆహా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు మూడు సీజన్ల ద్వారా ఎంటర్టైన్మెంట్ అందించిన బాలయ్య నాలుగవ సీజన్ కి గెస్ట్ గా ఎవరు రాబోతున్నారనే విషయం త్వరలోనే అధికారికంగా రాబోతోందట. ఈసారి కూడా వైవిధ్యమైన చమత్కారంతో బాలయ్య మెప్పించేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాలలో బిజీగా ఉండడం చేత ఈ షో ఇప్పట్లో స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. బాలయ్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్నారు ఈ సినిమా కూడా ఎన్నికల కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది బాలయ్య.. మరి ఈసారి హోస్టుగా బాలయ్య ఎంతటి రెమ్యూనరేషన్ తీసుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: