ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ ఆకర్షణీయమైన అప్ డేట్స్ రిలీజ్ చేస్తోంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగించేవారి కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఫోన్ కాల్స్ మాట్లాడే సమయంలో మరో కాల్ వస్తే కాల్ వైటింగ్ ఫీచర్ ఉపయోగించి ఆ కాల్ ను మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. 
 
వాట్సాప్ లో కూడా కాల్ వైటింగ్ ఫీచర్ ను వాట్సాప్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ కాల్ మాట్లాడుతున్న సమయంలో మరో కాల్ వస్తే హోల్డ్ లో పెట్టాల్సిన పని లేకుండా మరో కాల్ కు సులభంగా మార్చుకోవచ్చు. వాట్సాప్ కాల్ మాట్లాడుతున్న సమయంలో మరో కాల్ వస్తే వచ్చిన కాల్ వైటింగ్ కాల్ గా చూపిస్తుంది. వినియోగదారులు కాల్ ఆన్సర్ చేయాలనుకుంటే ఆన్సర్ చేయవచ్చు లేదా కాల్ ను రిజెక్ట్ చేయవచ్చు. 
 
వాట్సాప్ లో హోల్డ్ ఆప్షన్ మాత్రం ఉండదు. ఒక కాల్ మాట్లాడుతుండగా మరో కాల్ వస్తే ఆ కాల్ ను ఆన్సర్ చేస్తే అంతకుముందు మాట్లాడుతున్న కాల్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ అప్ డేట్ చేసుకొని ఈ ఫీచర్ ను ఉపయోగించవచ్చు. 
 
వాట్సాప్ లో ఒక ఫోన్ కాల్ మాట్లాడుతుండగా మరో ఫోన్ కాల్ వస్తే గ్రీన్ కలర్ లో ఎండ్ & యాక్సెప్ట్ అనే బటన్ రెడ్ కలర్ లో డిక్లైన్ అనే బటన్ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ బటన్ నొక్కితే మాట్లాడుతున్న కాల్ కట్ అయిపోయి కొత్త కాల్ కనెక్ట్ అవుతుంది. రెడ్ కలర్ బటన్ నొక్కితే ఇన్ కమింగ్ కాల్ క్యాన్సిల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: