ఐఫోన్ అంటే ఎవరికి  ఇష్టం ఉండ‌దు.  స్మార్ట్‌ఫోన్ ప్ర‌పంచంలో ఐఫోన్ల‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా మంది ఆ ఫోన్లను వాడాల‌ని క‌ల‌లు కంటుంటారు. కానీ ఐఫోన్ కొన‌డం అంటే మాట‌లు కాదు క‌దా. ఇక కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ఆ క‌ల‌ను నిజం చేసుకుంటారు. ఇక యాపిల్‌ నుంచి ఓ కొత్త ఫోన్‌ వస్తోందంటే టెక్‌ ప్రియులకు ఉండే ఆసక్తి మామూలుగా ఉండ‌దు. ఫోన్‌ కోసం రోజుల తరబడి క్యూలైన్‌లో నిలబడి మరీ ఫోన్‌ను సొంతం చేసుకున్న ఉదంతాలను చూశాం.  అయితే ఐఫోన్ ప్రేమికులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 

 

అయితే దీనిని కొనాలనుకోవడం క‌న్నా చూడాలనుకుంటేనే సంతృప్తి మిగులుతుంది. ఎందుకంటే ఇది అక్షరాలా లక్ష అమెరికన్ డాలర్లు. అంటే ఇండియ‌న్ క‌రెన్సీలో రూ.71లక్షలు. అవునండీ.. మీరు విన్న‌ది నిజ‌మే. Caviar Solarius Zenith Full gold iphone 11 Pro మోడల్ ఫోన్‌ను అత్యంత ఖరీదైన ఫోన్‌గా మార్చేశారు. దీని వెనుక ఉండే గ్లాస్‌ను తొలగించి గడియారంలా ఉండే డిజైన్‌తో 24క్యారెట్ల ప్లేట్‌ను అమర్చారు. అందులో బంగారంతో పాటు 137వజ్రాలను పొదిగారు.

 

ఇది నలుపు, బంగారం రంగులో ఫోన్ బాక్స్ ఉంది. బాక్స్ ఓపెన్ చేయగానే మెరుస్తున్న ఐఫోన్ బ్యాక్ ప్యానెల్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఓ ఫాస్ట్ ఛార్జర్, మెరుస్తున్న కేబుల్, గోల్డ్ ప్లేటెడ్ స్లిమ్ కార్డ్, ఎయిర్‌పాడ్స్ ప్రో ఉంటాయి. ఇక ఫీచర్ల విష‌యానికి వ‌స్తే.. ఇది కేవలం ఐఫోన్ 11ప్రో మాత్రమే. బ్యాక్ కవర్ ను మార్చి హంగులతో అద్దారు. కానీ, ఫోన్‌ ఫీచర్‌లో ఎటువంటి మార్పులు లేవు. మ‌రి ఈ అత్యంత ఖ‌రీదైన ఐఫోన్‌పై మీరు ఓ లుక్కేసేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: