ప్రముఖ మొబైల్ కంపెనీ ఎల్జి కొత్త ఫోన్లను మార్కెట్ లోకి తీసుకు వస్తుంది.. ఇటీవల పండగ సీజన్ లో లాంఛ్ అయిన ఫోన్ యువతను ఆకర్షణకు గురి చేసింది.. దీంతో మంచి టాక్ తో పాటుగా భారీ సేల్స్ ను కూడా అందుకుంది.అయితే ఈ సారి ఏకంగా మూడు ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. గతంలో వచ్చిన ఫోన్ల ఫీచర్స్ కన్నా కూడా ఎక్కువగానే ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.. W41, W41 +, W41 ప్రో పేర్లతో ఈ స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. ర్యా మ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు మినహా మిగతా ఫీచర్లన్నీ ఈ మూడింట్లో ఒకే విధంగా ఉంటాయి.


ఎల్ జీ నుంచి గత ఏడాది భారత్ లో విడుదలైన డబ్ల్యూ 31 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు కొన్ని మెరుగైన ఫీచర్లను చేర్చి ఈ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది.కొత్త W41 స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్-ఎండ్ కస్టమర్లు, మిడ్ రేంజ్ ఫోన్లను అందిస్తున్న వివిధ బ్రాండ్లను ఆధారంగా మార్కెట్ లోకి విడుదల చేసింది.. నోకియా ఫోన్ల మాదిరిగానే గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ తో వస్తాయి. ఈ మూడు స్మార్ట్ ఫోన్లు కూడా 48 ఎంపి క్వాడ్ కెమెరా, పెద్ద బ్యాటరీ, పంచ్ హోల్ డిస్ప్లే లాంటి ప్రత్యేకతల తో పాటుగా మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి తీసుకు వచ్చింది.


ఇకపోతే ఫోన్ డిజైన్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన ఏర్పడింది.. గతంలో వచ్చిన ఫోన్ల తో పోలిస్తే ఈ ఫోన్లకు డిమాండ్ కు పెరిగింది.ఎల్ జీ డబ్ల్యూ 41 సిరీస్ ధర రూ .13,490 నుండి ప్రారంభమవుతుంది. ఇవి మ్యాజిక్ బ్లూ, లేజర్ బ్లూ కలర్స్ తో అందుబాటులో ఉంటాయి.48 ఎంపి మైన్ కెమెరా, 8 ఎంపి అల్ట్రా వైడ్, 2 ఎంపి డెప్త్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో సెన్సార్ వంటివి ఉన్నాయి. దీని ముందుభాగంలో ఉన్న పంచ్ హోల్లో 8 ఎంపి సెల్ఫీ కెమెరాని అందించారు. వీటిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్ బీ టైప్ సీ పోర్టును అందించారు.. ఇప్పుడు ఈ ఫోన్లు టాప్ టెన్ లో ఒకటిగా భారీ స్థాయిలో సేల్స్ అందు కుంటుంటాయి అనేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: