దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో స్మార్ట్ ఫోన్  యూజర్లు ఉన్నారు. ప్రస్తుతమున్న జనరేషన్ లో ఒక ఇంటిలో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది. ఇక సిటీ లో అయితే చెప్పనక్కర్లేదు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ యూస్ చేసుకుంటారు. ఇప్పుడు మన జనరేషన్ లో చిన్న పిల్లలు సైతం  ఉదయం లేవగానే స్మార్ట్  ఫోన్లు చేత్తో పట్టుకొని ఉంటున్నారు. అయితే స్మార్ట్ ఫోర్ కొనాలనుకునే వారికి వచ్చే మార్చి నెలలో బెస్ట్ ఫోన్లు రాబోతున్నాయి.


 ఇప్పుడు  యువత విద్యార్థులు ఉద్యోగులు ఎక్కువగా స్మార్ట్ ఫోన్  ను వినియోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్  కంపెనీలో యూజర్లకు మరింత చేరువ కావడం కోసం ప్రతి నెల కొత్త ఫోన్ లో మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. మార్చి నెలలో దిగ్గజ కంపెనీల నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లు లాంచ్ కానున్నాయి. కొత్త ఫోన్ కొనాలి అనుకునేవారు మార్చి నెలలో విడుదల కాబోయే పాపులర్  ఫోన్ ల గురించి అవగాహన కలిగి ఉంటే మంచి అధునాతన ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేయవచ్చు.


 మార్చి 4వ తేదీన రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్ లాంచ్  కానున్నాయి. 5జి కనెక్ట్విటితో 108 మెగా పిక్సెల్ ప్రైమరీ  కెమెరాతో ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. రెడ్ మీ 10 సిరీస్ ఫీచర్లే రియల్ మీ 8 సిరీస్ ఫోన్లలో ఉండనున్నాయని 108 మెగా పిక్సల్ కెమెరాతో ఈ ఫోన్లు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి అని తెలుస్తోంది. వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్ మార్చ్ లో లాంచ్ కానుండగా ఈ ఫోన్ ధర 47,000 రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది.. స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్తో 8 జీబీ ర్యామ్ ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది అని సమాచారం.


 ఒప్పో ఎఫ్ 19 సిరీస్ ఫోన్లు మార్చి నెలలో లాంచ్ కానుండగా క్వాడ్ కెమెరాస్ తో 5జి కలెక్ట్విటితో ఈ ఫోన్ లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం. మోటోరాలా కంపెనీ నుంచి మోటో జీ 30, మోటో జీ 10 ఫోన్లు కూడా మార్చి నెలలోనే విడుదల కానున్నాయి. మోటో జి 30 తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లతో అందుబాటులోకి రానుందని సమాచారం. మోటో జీ 10    5000 ఎం ఏ హెచ్  బ్యాటరీ తో 48 మెగాపిక్సల్ కెమెరాతో రానుందని తెలుస్తోంది.  మొత్తానికి మార్చి నెలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ లో వస్తున్నాయ్ అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: