టాప్ మొబైల్ కంపెనీలలో ఒకటి రియల్ మీ.. ఈ కంపెనీ ఎలెక్ట్రానిక్ వస్తువులను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇప్పటికే పలు రకాల మొబైల్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ బడ్జెట్ ఫోన్లను అందిస్తుంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. సీ-సిరీస్‌లో మూడు స్మార్ట్ ఫోన్లు రియల్ మీ సీ25, రియల్ మీ సీ21, రియల్ మీ సీ20. ఈ మూడు ఫోన్లలోనూ వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఇచ్చారు.


రియల్ మీ సీ20 ధర

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. కూల్ బ్లూ, కూల్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ.కాం లలో ఈ ఫోన్ సేల్స్ జరుగుతున్నాయి.

ఫోన్ ఫీచర్లు గురించి చూస్తే...

ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు.  జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

రియల్ మీ సీ21 ధర

స్మార్ట్ ఫోన్ ధర రూ.7,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు. క్రాస్ బ్లూ, క్రాస్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ నెల 13 నుంచి ఈ కంపెనీ సేల్స్ ను ప్రారంభిస్తుంది.. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది.వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రోలెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కూడా ఉన్నాయి.. దీని బ్యాటరీ సామర్థ్యం కూడా సేమ్..


రియల్ మీ సీ25 ధర

ఇందులో కూడా రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,999గానూ, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.10,999గానూ నిర్ణయించారు. వాటరీ గ్రే, వాటరీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్ మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు కూడా స్టోరేజ్‌ను ఇంకా పెంచుకోవచ్చు.ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సెన్సార్‌ను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

పైన తెలిపిన ఫోన్లు అన్నీ కూడా ఏప్రిల్ 13 నుంచి 16 లోపు లాంఛ్ కానున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: