తాజా నివేదిక ప్రకారం ఈ వివో స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. దీనిలో ప్రైమరీ కెమెరా 64 మెగా పిక్సెల్‌లుగా ఉంటుంది. ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఈ ఫోన్ ను నవంబర్ 2 నుంచి 5 లాంచ్ చేయవచ్చు. అయితే ఈ ఫోన్ సమాచారాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ కొన్ని వెబ్ సైట్ల ద్వారా లీక్ అయ్యింది.
Vivo V23e డిజైన్, స్పెసిఫికేషన్‌లు ఎలా ఉన్నాయంటే ?
హ్యాండ్-ఆన్ వీడియో ప్రకారం ఇది వాటర్ ప్రూఫ్ డిస్‌ప్లే తో వస్తుంది. ఇందులో OLED ప్యానెల్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పని చేస్తుంది. ఇది వెనుక ప్యానెల్‌లో గాజు, ప్లాస్టిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. కుడి వైపున వాల్యూమ్ రాకర్ ఉండగా, దీనిలో పవర్ బటన్ కూడా అందుబాటులో ఉంటుంది. మైక్రోఫోన్ అంచులోనే కనిపిస్తుంది. SIM స్లాట్‌లు దిగువన ఇచ్చారు. ఇది టైప్ C USB పోర్ట్ తో పని చేస్తుంది. ఇందులో గ్రిల్ స్పీకర్లు ఉన్నాయి. దీనికి 3.5 మిమీ జాక్ ఉంది.
Vivo V23e కెమెరా సెటప్ విషయానికొస్తే... వెనుక ప్యానెల్‌లో నిలువు కెమెరా మాడ్యూల్ ఉండగా, దీనిలో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ లెన్స్, మూడవ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4030 mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ Funtouch 12 ఆధారిత Android 12లో పని చేస్తుంది. ఇది 5g స్మార్ట్‌ఫోన్ అవుతుంది. లీక్స్ ప్రకారం వియత్నాంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర VND 10,000,000 (సుమారు రూ. 32,668) ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ రిటైల్ బాక్స్‌లో ఇయర్‌ఫోన్‌లు, USB టైప్ C, 3.5mm జాక్ డాంగిల్, కొన్ని యూజర్ మాన్యువల్‌లు ఉంటాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి