ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ను ఎక్కువగా ఉపయోగించుకోవడంలో ఈజీ కావడానికి మరిన్ని కొత్త ఫీచర్‌ లను అందిస్తుంది. మెటా కీ అండర్ లో ఉన్న ఈ ఇన్‌స్టాగ్రామ్ యాప్ అనేక సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తున్నప్పటికి, ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ ఇప్పటికీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్నేహితులు లేదా ఇతరులు మీరు ఆన్లైన్ లో ఉన్నారన్న విషయాన్నీ తెలిపే గ్రీన్ బటన్‌ను చూడగానే వారి ఫోటోలు, కథనాలు, మీమ్స్ మొదలైన వాటిని పంపుతూ వేధించడానికి ప్రయత్నిస్తుంటారు. అటువంటి సమస్యను ఎప్పుడైనా ఎదుర్కోవచ్చు. ఎదుర్కోవాల్సి రావచ్చు. అటువంటి వాటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ టిప్స్ పాటించండి.

ఇన్‌స్టాగ్రామ్‌లో 'లాస్ట్ సీన్' ఆప్షన్ డిఫాల్ట్‌గా ఆన్ అవుతుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ యాక్టివిటీ స్టేటస్‌ను ఆఫ్ చేయడం వల్ల మీరు ఈ వేధింపుల నుంచి తప్పించుకునే ఛాన్స్ లభిస్తుంది. చాట్స్ ట్యాబ్‌లో మిమ్మల్ని అనుసరించే లేదా నేరుగా మీతో చాట్ చేసే వ్యక్తులు మీరు చివరిగా ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు చూడగలరు. కానీ మీరు చివరిగా చూసినట్టు వాళ్లకు తెలియకుండా మార్చవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లో 'లాస్ట్ సీన్'ని ఎలా దాచాలి ?
ఆండ్రాయిడ్ ఫోన్‌ లో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఓపెన్ చేయండి
మీ ప్రొఫైల్‌ కి వెళ్లి మెనూ పై నొక్కండి (ఎగువ కుడివైపు మూలలో మూడు డాట్స్ లేదా లైన్స్ కనిపిస్తాయి)
న్యూ టైల్‌కి స్క్రోల్ చేయండి. సెట్టింగ్‌లు, ఆపై ప్రైవసీని క్లిక్ చేసి లాస్ట్ సీన్ ఆప్షన్ ను సెర్చ్ చేయండి.  
ఇన్‌స్టాగ్రామ్‌ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. మీరు దీన్ని ఆఫ్ చేయాలి.

పిసిలో చివరిగా చూసిన కార్యాచరణ స్థితిని ఎలా దాచాలి
మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి PC లేదా మొబైల్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తుంటే, మీరు చివరిగా చూసిన యాక్టివిటీ స్టేటస్‌ని ఎలా ఆఫ్ చేయవచ్చు తెలుసుకోండి
వెబ్ బ్రౌజర్‌లో instagram.com అని టైప్ చేయండి
మెనూ ఐకాన్‌పై క్లిక్ చేసి, ఆపై సెట్టింగ్‌లపై క్లిక్ చేయండి.
ఆపై ప్రైవసీ & సెక్యూరిటీ పై క్లిక్ చేసి, లాస్ట్ సీన్ ఆప్షన్ ను ఆఫ్ చేయడానికి క్లిక్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: