ఈ మధ్యకాలంలో పలు బ్రాండెడ్ కలిగిన మొబైల్స్ కస్టమర్ల కోసం పలు రకాల అప్డేట్ తో మొబైల్స్ ని విడుదల చేస్తూనే ఉన్నాయి. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ మొబైల్ దిగ్గజ సమస్థ షావోమి కొత్త స్మార్ట్ మొబైల్ ని విడుదల చేస్తోంది. ఇప్పటివరకు ఈ బ్రాండెడ్ నుంచి 12 సిరీస్ మొబైల్స్ విడుదల కావడం జరిగింది. ఇప్పుడు తాజాగా 13 సిరీస్ మొబైల్స్ ని లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఈ మొబైల్ అధికారికంగా లాంచ్ కాబోతున్నట్లు షోవోమి సంస్థ ప్రకటించింది.


ఇప్పటివరకు ఈ బ్రాండెడ్ కు సంబంధించిన మొబైల్స్ అతి తక్కువ ధరలో కస్టమర్లను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 12 సిరీస్ మొబైల్ కి సీక్వల్గా 13 చేసిన కూడా లాంచ్ చేయబోతోంది షావోమి. ఇప్పటివరకు వీటి మీద ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ ఆన్లైన్లో మాత్రం కొన్ని ఫీచర్లు లీకవ్వడం జరిగింది. ఈ మొబైల్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.. వాటి ధర ఎంత ఉండే అవకాశం ఉంటుందో వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఈ స్మార్ట్ మొబైల్ కాల్వామ్ స్నాప్ డ్రాగన్ 8త్ జనరేషన్ గా ఉండబోతున్నట్లు సమాచారం.  ప్రీమియం సీ లో భాగంగా ఈ మొబైల్ ని తీసుకురాబోతున్నారు . ఈ మొబైల్  డిస్ప్లేలో కూడా అదిరిపోయే  టెక్నాలజీతో అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ MIUI 14 ను అందించబోతున్నట్లుగా సమాచారం.  ఈ స్మార్ట్ మొబైల్ ప్రత్యేకంగా IP -68 రేటింగ్ తో వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ గా ఈ మొబైల్ ని తయారు చేయబోతున్నట్లు సమాచారం. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.65 అంగుళాలతో కలదు. ధర విషయంలో మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ గత మొబైల్ ధర చూస్తే రూ.63,000 ఉండగా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ ఒకటవ తేదీన రాత్రి 7 గంటలకు షావోమి 13 సిరీస్ గల మొబైల్ ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: