ఇటీవల వరుసగా స్మార్ట్ మొబైల్స్ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. దీంతో పలు దిగ్గజ సంస్థలు కూడా స్మార్ట్ వాచెస్ తయారీ పైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఫైర్ బోల్ట్ నుంచి అదిరిపోయే వాచ్లను విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే పలు స్మార్ట్ వాచ్లను పరిచయం చేసింది ఫైర్ బోల్ట్ తాజాగా మార్కెట్లోకి మరొక రెండు సరి కొత్త వాచ్లను తీసుకురాబోతోంది ఫైర్ బోల్ట్ డాజర్, ఫైర్ బోల్ట్ స్టార్ డస్ట్ పేరుతో ఈ వాచ్లను లాంచ్ చేసింది. ఇంతకీ ఈ వాచ్లు ఎలాంటి ఫిచర్స్ ఉన్నాయి. వాటి ధర గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.Fire bolt doger:
ఈ స్మార్ట్ వాచ్ 1.43 అంగుళాల అమోఎల్ఈడి డిస్ప్లేను అందిస్తుంది బ్లూటూత్ కాలింగ్ తో పాటు కాల్ హిస్టరీ డయల్ ప్యాడ్ కాంట్రాక్ట్ వంటి ఫీచర్లు ఇందులో కలవు. 400 ఎంఎంహెచ్ బ్యాటరీని కూడా అందిస్తుంది. ఇక 15 రోజులపాటు స్టాండ్ బై తో పని చేస్తుంది. అలాగే 108 స్పోర్ట్స్ ను కూడా తీసుకువచ్చింది ఈ స్మార్ట్ వాచ్. ఇక ఇందులో ఇన్ బుల్ట్ మైక్ స్పీకర్ను కూడా అందించింది వాటర్ రెసిస్టెంట్ తో కూడా కలదు ధర విషయానికి వస్తే ఫైరు బోల్ట్  డాజర్ రూ.3,499 ధరకి అందుబాటులో ఉంది.


Fire bolt stardust:
ఫైర్ బోల్ట్ స్టార్ డస్ట్ వాచ్ విషయానికి వస్తే..1.95 ఇన్ చెస్ హెచ్ డి టి ఎఫ్ టి ఎల్ సి డి స్క్రీన్ అందిస్తుంది. బ్లూటూత్ 5.0 పనిచేస్తుంది ఈ స్మార్ట్ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ కాల్ హిస్టరీ కాంటాక్ట్స్ వంటి ఫీచర్లు కలవు. ఇక ఈ స్మార్ట్ వాటర్ రెసిస్టెన్స్ తో కూడిన వాచి తో పాటు వాయిస్ అసిస్టెంట్ సపోర్టు కూడా ఉంటుంది ఐదు రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ద్వారా విషయానికి వస్తే.. రూ 2,499 రూపాయలకె అందుబాటులో కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: