ఇప్పటివరకు మన పేరు మీద మనకు తెలియకుండా ఎవరైనా సిమ్ తీసుకుంటే అది రాబోయే రోజుల్లో ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు మనకు తెలియకుండానే మన పేరు మీద సిమ్ కార్డు తీసుకొని ఫ్రాడ్ కు పాల్పడుతూ ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.. ఇలాంటివి చాలా చోట్ల జరిగాయని ఇప్పటివరకు ఎంతోమంది తెలియజేశారు. అందుచేతనే మీ ఆధార్ కార్డు మీద మీకు తెలియకుండా ఏవైనా నెంబర్లు యాక్టివేషన్ ఉన్నాయా లేదా అనే విషయం ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


మొబైల్ లేదా కంప్యూటర్ నుంచి చాలా సింపుల్గా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు కేవలం మనం తీసుకున్న మొబైల్ నెంబర్లు మాత్రమే కాకుండా వాటి వివరాలు ప్రస్తుతం వాడుకలో ఉన్న నెంబర్లు కూడా మనం తెలుసుకోవచ్చు.. టెలికాం యూజర్లు తీసుకున్న అన్ని మొబైల్ నెంబర్స్ వివరాలను మరియు వాటి యాక్టివేషన్ స్టేటస్ ను పారదర్శకంగా ఉండడం కోసం..DOT ఇటీవల ఒక కొత్త వెబ్సైట్ ను తీసుకురావడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మనం తీసుకున్న మొబైల్ నెంబర్లు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ను కూడా తెలుసుకోవచ్చుట.

మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేసి..TAFCOP DGTELECOM.GOV.IN వెబ్ సైట్ ని ఓపెన్ చేయాలి ఆ తర్వాత మన వద్ద ఉన్న మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి.. కింద ఇచ్చిన ఓటీపీ దగ్గర ఓటీపీ నెంబర్ ని ఎంటర్ చేయవలసి ఉంటుంది.ఆ తర్వాత మీ పేరు  పై పనిచేసే అన్ని మొబైల్ నెంబర్స్ పైన పూర్తి జాబుతాను మనం తెలుసుకోవచ్చు. ఏదైనా నెంబర్ గురించి రిపోర్ట్ ఓటిపిని ధృవీకరించిన తర్వాత మీ పేరు  పై పనిచేసే అన్ని మొబైల్ నెంబర్ను అక్కడ పూర్తి జాబితాను పొందవచ్చు.అయితే ఈ విషయం ఆంధ్ర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, త్రిపుర ,మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ తెలంగాణ, కేరళ ,మేఘాలయ వంటి ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: