ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ముఖ్యంగా ఇండియాలో కూడా EV బైకుల హవానే బాగా కనిపిస్తున్నాయి. అమెరికా చైనా తర్వాత ఎక్కువగా ఇండియాలోనే ఈ వాహనాలు సేల్స్ పరంగా అత్యధికంగా అమ్ముడుపోతున్నట్లు ఒక నివేదికలో నిపుణులు తెలిపారు. దీంతో చాలామంది స్టార్టప్ కంపెనీలు, బడా కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేస్తూ ఉన్నాయి.. ఇప్పుడు తాజాగా MX మోటో కంపెనీ M-16 పేరుతో ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది..


ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.1.98 లక్షల నుండి ప్రారంభమవుతుంది. బ్యాటరీ ప్యాక్ కోసం 8 సంవత్సరాలు వారంటి మోటార్ కంట్రోల్ పైన మూడేళ్లు వారంటీ పూర్తి మోడల్ బాడీ తో సహా అనేక ప్రయోజనాలను కూడా అందిస్తున్నది.. ఈ ఎలక్ట్రిక్ బైక్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నది.. కాబట్టి..MX MOTO M-16 బైకు గురించి మరికొన్ని విషయాలను చూద్దాం.. ఈ బైక్ భారతీయ పరిస్థితులకు అనుగుణంగానే తయారు చేశారట.. స్మాల్ స్క్రీన్ తో రౌండ్ హెడ్లైట్ క్లాసిక్ స్టెప్ డిజైన్తో విస్తృత హ్యాండిల్ బార్.. యు ఎఫ్ డి ఫోర్ కులు.. 17 అంగుళాల టైర్లు డిస్క్ బ్రేకులతో వస్తోంది.

MX 16 MOTO:
ఈ బైకు యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. లీథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. దాదాపుగా ఈ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 180- 220 కిలోమీటర్ల వరకు పయనిస్తుందట. కేవలం 3 గంటలలో 0 నుంచి 90% వరకు చార్జింగ్ అవుతుందట. గరిష్ట వేగాన్ని మాత్రం కంపెనీ ఇంకా తెలియజేయలేదు.. అలాగే నావిగేషన్ బోర్డులో కాల్ నోటిఫికేషన్, మ్యూజిక్ సిస్టం, బ్లూటూత్ కనెక్టివిటీ తో పాటు సరికొత్త డిస్ప్లే రాబోతోందట. క్రూఇస్ కంట్రోల్, పార్క్ అసిస్టెంట్, రివర్స్ మోడ్ ఇతరత్రా వంటి ఫీచర్లు కూడా ఈ బైక్ లో కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి: