
అందులో రూ.458 రూపాయల ప్లాను 24 రోజులపాటు ఉంటుంది. ఇది అన్లిమిటెడ్ కాలింగ్ వాయిస్ తో పాటుగా..1000 ఉచిత ఎస్ఎంఎస్లను పొందవచ్చు.. ఈ ప్లాన్ లో జియో సినిమా, జియో టీవీ, జియో కి సంబంధించిన యాప్స్ ను కూడా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రకారం ఇండియాలో ఏ నెట్వర్క్ అయినా ఉచితంగా రోమింగ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు.
మరొక ప్లాన్ రూ.1958 ఈ ప్లాన్ 365 రోజులు ఉంటుంది. పదేపదే రీచార్జ్ చేయకుండా ఒక్కసారి ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే చాలు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు..3600 ఉచితంగా ఎస్ఎంఎస్లు ఉచిత రోమింగ్ సౌకర్యాలు కూడా ఉంటాయి. అలాగే జియో సినిమా టీవీకి సంబంధించి అన్నిటిని కూడా ఉచితంగానే పొందవచ్చు. కేవలం వాయిస్ కాల్స్, మెసేజ్లను ఉపయోగించే వారికి ఇది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ గా ఉన్నది.
టెలికాం రెగ్యులరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనల మేరకు జియో ప్లాన్లను సవరించుకుంది. ముఖ్యంగా అన్ని టెలికం సంస్థలకు కాలింగ్ ఎస్ఎంఎస్ సౌకర్యాలతో కూడిన చౌకైన ప్లాన్లను కూడా అందించాలని తెలియజేయడంతో జియో తన రెండు పాత రీఛార్జ్ ప్లాన్లను నిలిపివేసింది. రూ.479 ప్లాన్ తో పాటుగా 1899 ప్లాన్లను కూడా నిలిపివేసింది. కొత్త ప్లేస్ లో కొత్త రీఛార్జి ప్లాన్ తీసుకురావడం జరిగింది.