ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఎక్కువ కావడం అలాగే చాలా కంపెనీలు కూడా ఎక్కువ నష్టాలు పాలు కావడంతో పలు టెక్‌ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అలా ఒక్కో కంపెనీ వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తుంటే.. చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు భారీ మొత్తంలో బోనస్‌ను ప్రకటించింది.అయితే, ఆ డబ్బు మొత్తాన్ని కూడా వారి ఖాతాలో జమ చేయకుండా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి నగదును కట్టకట్టలుగా వేదికపై పేర్చి అందరికీ అందించింది.దీంతో కంపెనీ అందించే బోనస్‌ డబ్బు మొత్తాన్ని కూడా చేతులతో తీసుకెళ్లలేక సదరు ఉద్యోగులు బ్యాగులు తెచ్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌గా మారాయి.చైనా దేశానికి చెందిన హెనాన్‌ మైన్‌ అనే కంపెనీ క్రేన్లను ఉత్పత్తి చేస్తుంటుంది.


ఇక కరోనా మహమ్మారి కారణంగా పలు కంపెనీలు ఆర్థికంగా నష్టాలను చవిచూసినప్పటికీ, హెనాన్‌ మైన్‌ కంపెనీకి మాత్రం చాలా భారీ లాభాలు వచ్చాయి. దీంతో కంపెనీ లాభాలకు కారణమైన ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలని ఆ కంపెనీ నిర్ణయించింది. అందులో భాగంగా కంపెనీ సేల్స్‌ విభాగంలో మంచి పనితీరు కనబరిచిన 30 మందికి పైగా ఉద్యోగులకు ఏకంగా 61 మిలియన్‌ యువాన్లు (సుమారు ₹ 73 కోట్లు) బోనస్‌గా ప్రకటించింది.ఈ డబ్బు మొత్తాన్ని కూడా ఉద్యోగులకు పంచేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ఏకంగా ₹ 73 కోట్ల మొత్తాన్ని నోట్ల కట్టల రూపంలో స్టేజ్‌పై పేర్చింది. తర్వాత ఉద్యోగుల్లో అత్యుత్తమైన పనితీరు కనబరిచిన ముగ్గురు ఉద్యోగులకు ఒక్కో ఉద్యోగికి ఐదు మిలియన్‌ యువాన్లు (సుమారు ₹ 6 కోట్లు) చొప్పున డబ్బుని అందించింది. మిగిలిన వారికి ఒక్కోక్కరికి ఒక మిలియన్‌ యువాన్ల డబ్బుని (సుమారు ₹ 1.20 కోట్లు ) బోనస్‌గా ఇచ్చింది. దీంతో కంపెనీ అందించిన ఈ నోట్ల కట్టలను ఉద్యోగులు చేతులతో తీసుకెళుతున్న వీడియోలు చైనా సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: