సాధారణంగా యుక్త వయసులో ఉన్నప్పుడు యువతి యువకుల మధ్య ప్రేమ పుట్టడం సర్వసాధారణం. అయితే వారి మధ్య ఉన్న ఎట్రాక్షన్ ను వాళ్ళు ప్రేమ అని భావిస్తూఉంటారు. అయితే కొంతమంది ప్రేమ విషయంలో కొన్ని హద్దులు పెట్టుకుంటూ ఉంటారు. చదువు పూర్తయి ఉద్యోగం సాధించిన తర్వాత ప్రేమ దోమ లాంటి వాటి జోలికి వెళ్లాలి అనుకుంటే.. మరి కొంతమంది మాత్రం చదువును పక్కకు పట్టేసి ప్రేమ దోమ అంటూ చెట్టా పట్టాలేసుకొని తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇక ఇలా పిల్లలు ప్రేమలో పడతారేమో అనే భయం తల్లిదండ్రుల్లో ఎప్పుడూ ఉంటుంది. ఇక ఇలా పిల్లల ప్రేమ విషయం తెలిస్తే తల్లిదండ్రులు అస్సలు యాక్సెప్ట్ చేయరు అన్న విషయం తెలిసిందే.


 అలాంటిది ఏకంగా కూతురుని ప్రేమిస్తున్న యువకుడు తమ ఇంటికి వచ్చి మేడ మీద కూతురుతో రొమాన్స్ చేస్తూ ఉంటే ఏ తల్లి అయినా కోపంతో ఊగిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. చాటుమాటు రొమాన్స్ లు ఎప్పుడూ వర్కౌట్ కావు అనేదానికి ఇక్కడ వీడియో నిదర్శనం గా మారిపోయింది అని చెప్పాలి. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో కూడా హీరో హీరోయిన్ ఇలా మేడమీదికి వెళ్ళి ముద్దుల్లో మునిగిపోతూ ఉంటే.. హీరోయిన్ తండ్రి అది చూసి వారిని మందలించడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇలాంటి సీన్ రిపీట్ అయింది అని చెప్పాలి. ఏకంగా ఒక యువతి తన ప్రియుడితో కలిసి మెడ మీదకి వెళ్ళి ముద్దుల్లో మునిగిపోయింది.


 అయితే ఎందుకో ఇక యువతి తల్లికి అనుమానం వచ్చింది. వెంటనే మేడమీదికి చేరుకుంది. అయితే యువతి తల్లి వస్తున్నట్లు కనిపెట్టిన యువకుడు ఆమెకు కనిపించకుండా దాక్కునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె ఎంతో తెలివిగా వ్యవహరించి ఇక అక్కడ కలియ తిరుగుతూ యువకుడి కోసం  వెతికింది. చివరికి ఆమె అనుమానమే నిజమైంది. గుట్టుగా దాక్కున కుర్రాడిని కనిపెట్టింది. దీంతో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అబ్బాయి చొక్కా పట్టుకుని చెప్పుతో కొట్టడం స్టార్ట్ చేసింది. దీంతో ఆ యువకుడు ఏదోలా తప్పించుకుని అక్కడినుంచి జంపాయ్యాడు. ఇంకేముంది అక్కడ ఉన్న కూతురు జుట్టు పట్టుకుని చెప్పుతో చెడ మడ కొట్టేసింది. ఈ వీడియోలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: