
ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ రాయలసీమ, దక్షిణ కోస్తా వంటి ఏరియాలలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో భారీగా వర్షాలు పడుతున్నారు. దీంతో రైతులకు కూడా తీవ్రంగా పంట నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో రానున్న 24 గంటలు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం కాకినాడ గుంటూరు, ఏలూరు, పశ్చిమగోదావరి, విజయవాడ కోనసీమ వంటి ప్రాంతాలలో వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరిస్తున్నారు. అలాగే రాయలసీమ అనంతపూర్ తిరుపతి కర్నూలు వంటి ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
రానున్న సమయంలో వర్షపాతం ఉధృత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. అదనంగా బంగాళాఖాతంలో తుఫాన్ అభివృద్ధి కూడా చెందుతుందని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. అధికారులు దీంతో విశాఖపట్నం నర్సీపట్నం అనకాపల్లి అరకులోయ వంటి ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. అమెరికా వాతావరణం తెలిపిన ప్రకారం మే రెండో వారంలో బంగాళాఖాతంలో తుఫాను అభివృద్ధి చెందుతుందని ఒకవేళ తుఫాను గనుక ఏర్పడితే ఆ తుఫానుకు మోచాగా పేరు పెట్టమన్నారు.. గతేడా అది మే నెలలో వచ్చిన తుఫాన్ కు ఆసాని అనే తుఫాను పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.