
ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండకు అల్లాడిపోతున్న నేపథ్యంలో వారికి ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ ఒక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం అనగా మే 19 నుండి 23వ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు కూడా అప్రమత్తం కావాలి అని వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
బంగాళాఖాతం నుంచి రాయలసీమ కోస్తా జిల్లాల్లోకి గాలులు వీస్తున్నాయని.. ఈ ప్రభావంతో కోస్తాలోని పలు జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం తో పాటు పలు జిల్లాలలో గాలి దుమారంతో కూడిన వర్షాలు పడునున్నాయట. దీంతో వేడి కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కొద్దిగా చల్లటి గాలులతో ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. అయితే రైతులు ఎండా కారు పంటలు వేసుకున్నట్లయితే వారు అప్రమత్తంగా ఉండాలి అని.. పంటలను కాపాడుకోవాలి అని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.