సినిమా స్టార్స్, సెలెబ్రెటీస్ అన్నాక గాసిప్స్ అనేవి కామన్. సదరు గాసిప్స్ ను కొందరు సెలబ్రిటీలు ఎంజాయ్ చెస్తే, ఇంకొందరు మాత్రం సహించలేక డిఫెండ్ అవుతారు.ఒక్కోసారి కోపం కూడా వ్యక్తం చేస్తారు.తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేయనంతవరకూ దాదాపుగా అన్నీ గాసిప్స్ ను సెలబ్రిటీలు ఎంజాయ్ చేస్తూ లైట్ తీసుకుంటారు కాని ఒక్కసారి అవధులు దాటి లైన్ క్రాస్ అయ్యింది అంటే మాత్రం చెలరేగిపోతారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ కూడా అలానే రియాక్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.సాధారణంగానే ఈ గాసిప్పులకు చాలా దూరంగా ఉండే అనుపమపై గత కొన్నాళ్ళుగా క్రికెటర్ బూమ్రాతో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంది అంటూ వస్తున్న వార్తలపై తొలుత స్పందించకపోయినా..
మరీ ముదిరిపోతుండడంతో ఫైర్ అయ్యింది. ఒకటికి రెండు సార్లు అనుపమ స్వయంగా వివరణ ఇచ్చినప్పటికీ...తనపై వస్తున్న ఈ గాసిప్పులు మాత్రం ఆగలేదు. అయితే.. ఇప్పుడు బుమ్రా పెళ్ళి ఒక స్పోర్ట్స్ యాంకర్ తొ సెట్ అవ్వడంతో ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు చెందిన రిపొర్టర్ అనుపమను స్పందన అడిగిందట. అప్పటివరకూ ఆపుకున్న కోపం మొత్తాన్ని ఆమెపై కక్కేసిందట అనుపమ. అసలు బుద్ధి ఉందా? అనే స్థాయిలో తిట్టేసిందట. ఇలా ఫోన్ లొనే తిట్టేసరికి షాక్ అయిపోయిందట సదరు రిపోర్టర్.ఇక అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వుంది.ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు, మలయాళంలో ఒకటి, తమిళంలో రెండు సినిమాలు చేస్తూ మళ్ళీ బిజీ అయిపోయిన అనుపమ, తెలుగులో స్టార్ హీరొయిన్ గా ఎదగడం కోసం విశ్వప్రయత్నం చేస్తోంది. మరి ఆమె ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో, స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోగలుగుతుందో లేదో చూడాలి.కాని సోషల్ మీడియాలో అయితే అనుపమ స్టార్ హీరోయిన్ అనే చెప్పాలి. ఈమెకు కొన్ని లక్షల్లో ఫాలోవర్స్ వున్నారంటే అర్ధం చేసుకోండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి