కారులో నుంచి స్నేహితులంతా కిందకు దిగారు. ఆ యువకుడి పేరు టికైల్ విల్సన్ అని తెలుసుకుని, తాము సాయం చేస్తామని చెప్పి టైరు మార్చే పనిలో నిమగ్నమయ్యాడు. అయితే వారు కారు టైరు మారుస్తూ ఉండగా టికైల్.. ఉన్నట్లుండి వారి కారును దొంగిలించబోయాడు. అందులో ఎక్కి చెక్కేయబోయాడు. కానీ అతడి అదృష్టం అడ్డం తిరిగింది. కారును రివర్స్ చేయగానే పుట్‌పాత్‌ను ఢీకొట్టి ఎటూ కదలకుండా నిలబడిపోయింది.ఈ హఠాత్పరిణామంతో షాకయిన రియాడ్, అతడి ఫ్రెండ్స్ వెంటనే తమ కారు వద్దకు చేరుకున్నారు. రియెడ్ తన కారులోకి చేరి హ్యాండ్ గన్‌తో టికైల్‌ను నిలువరించాడు. అంతలో పక్కనే ఉన్న పోలీసులు అక్కడకు చేరుకుని టైకెల్‌పై కేసు నమోదు చేశారు. అయితే రియెడ్ మాత్రం కేసు పెట్టడానికి నిరాకరిస్తుండడంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో కారు ఓనర్ అతడేనా కాదా..? అని పరిశీలించారు. దీంతో ఈ సారి షాక్ వారికి తగిలింది. ఆ కారు రియెడ్‌ది కాదని, రియెడ్ కూడా ఓ దొంగేనని, సదరు టయోటా కారును ప్రిన్స్ జార్జ్ కౌంటీనుంచి అతడు దొంగిలించాడని గుర్తించారు. దీంతో టికైల్, రియెడ్‌లను అరెస్ట్ చేశారి సెల్‌లో వేశారు. అయితే చివరికి వ్యక్తిగత పూచీకత్తు మీద వదిలిపెట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి