పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి లభించడం, పెళ్లికి వచ్చిన వారు తప్పకుండా మాస్క్, శానిటైజర్ లు వాడటం వంటి నిబంధనలను ప్రస్తుత కాలంలో పాటిస్తున్నారు. అయితే సంవత్సరం నుంచి అందరినీ ఎంతో భయబ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారికి ఎట్టకేలకు వ్యాక్సిన్ కనుగొన్న సంగతి మనకు తెలిసిందే. ప్రపంచం మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది.ఈ క్రమంలోనే వ్యాక్సింగ్ గురించి అవగాహన ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మరికొంతమంది లేనిపోని అపోహల కారణంగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇష్ట పడటం లేదు. ప్రస్తుతం మళ్లీ దేశం మొత్తం వైరస్ వ్యాప్తి జరుగుతుండడంతో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు ఎంతో అవగాహన కల్పిస్తున్నారు.
తాజాగా గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన గోకుల్ అనే యువకుడికి విజయవాడకు చెందిన భవ్య అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. వీరిద్దరి వివాహం జూన్ 5వ తేదీన జరగనుంది. అయితే తన వివాహానికి రావాలంటే వచ్చే ప్రతి ఒక్క బంధువు కూడా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటేనే పెళ్లికి రావాలని కండిషన్ పెట్టాడు.ఈ విధంగా వరుడు కండిషన్ పెట్టడంతో బంధువులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో వధువు బంధువులు ఎంతో ఆశ్చర్యానికి గురై చేసేదేమీలేక విజయవాడలో భవ్య ఆస్పత్రిలో వధువు తరపు బంధువులు 20 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. అదే విధంగా వరుడి కుటుంబ సభ్యులు సైతం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ విధంగా కరోనా వ్యాక్సిన్ పట్ల మరికొంతమందిలో అవగాహన తీసుకురావడం కోసం వరుడు పెట్టిన కండిషన్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి