భగవంతుడు ఏంటి..? ప్రసాదం భుజించడం ఏంటి..? ఇది కలియుగం.. అలాంటివి జరగవు అని కొంతమంది కొట్టి పడేస్తూ ఉంటారు.. కొంతమంది ఏమో నిజంగానే దేవుడు ప్రసాదాన్ని భుజిస్తున్నాడో ఏమో అని మరికొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు..? అయితే ఎవరు ఏ విధంగా తమ అభిప్రాయాలను వ్యక్త పరిచినా..ఇప్పుడు చెప్పబోయేది మాత్రం అక్షర సత్యం.. నిజంగానే ఆ దేవాలయంలో భగవంతుడు ఆయనకు సమర్పించిన ప్రసాదాన్ని, ఆయనే స్వయంగా భుజిస్తున్నాడట. ఇక ఆ దేవాలయం ఎక్కడ ఉంది..? ఆ భగవంతుడు ఎవరు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..

కేరళలో ఉన్న తిరువరపు శ్రీ కృష్ణ దేవాలయం లో.. భక్తులు స్వామి వారికి పెట్టె నైవేద్యాన్ని స్వయంగా భగవంతుడే తింటారు అని అక్కడి భక్తులు చెబుతున్నారు.. అర్ధరాత్రి తర్వాత ఏకాంతసేవ తరువాత దీపారాధన చేసే ఏకైక దేవాలయం కూడా ఇదేనట.. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే , ఈ దేవాలయంలోని స్వామి వారికి ఆకలి ఎక్కువ.. అందుకే రోజుకు ఏడు సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు అక్కడి అర్చకులు.. అంతేకాదు నైవేద్యాన్ని సమర్పించిన ప్రతి సారి కూడా ఆ నైవేద్యం లో కొంత భాగం తగ్గిపోవడంతో స్వామివారే నైవేద్యాన్ని తింటారు అని అక్కడి భక్తులు విశ్వసిస్తారు.. అంతే కాదు అందరూ చూస్తుండగానే స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదం తగ్గిపోవడం మనం గమనించవచ్చు.


సాధారణంగా మన దేవాలయాల్లో అభిషేకాలు ,అర్చనలు, అలంకరణలు అయిన తర్వాతనే నైవేద్యాన్ని సమర్పిస్తారు.. కానీ ఈ దేవాలయములో మాత్రం నైవేద్యం సమర్పించిన తరువాతనే అభిషేకం ,అర్చనలు జరుగుతాయి. కరోనా అయినా, సునామీ, భూకంపం అయినా ఏది వచ్చినా సరే స్వామి వారికి మాత్రం నైవేద్యం తప్పకుండా సమర్పించాలి అని అక్కడ అర్చకులు చెబుతున్నారు.. అంతేకాదు గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం మూతపడదట.. ఇక్కడ మరొక ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, స్వామి వారికి ఆకలి ఎక్కువ.. సమయానికి ప్రసాదం సమర్పించకపోతే స్వామివారి నడుముకు చుట్టిన ఆభరణం కూడా జారి, కిందకు వచ్చేస్తుందట. ఇక ఎవరైనా జాతకంలో దోషాలు ఉంటే, ఈ స్వామిని పూజించడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: