ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై రోజు రోజుకి భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం విడుదల చేస్తున్న ఒక అప్డేట్ ఈ సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచేస్తూ ఉంది. వచ్చే సంవత్సరం ఈ సినిమా విడుదల కాబోతుండగా.. ఇక ఈ సినిమాలో పాటలను, పాత్రలను కూడా వరుసగా విడుదల చేస్తుంది చిత్ర బృందం. ఇకపోతే ఇటీవలే నవంబర్ 10వ తేదీన ఈ సినిమాలోని నాటు నాటు అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ పాట ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ రికార్డులను కొల్లగొడుతుంది.


 ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అందర్నీ అబ్బురపరుస్తోంది అని చెప్పాలి. ఇక చిన్నల నుంచి పెద్దల వరకు కూడా ఈ పాట అందరిని ఉర్రూతలూగిస్తోంది. ఈ పాట వింటే చాలు అన్ని వయస్సుల వారు కూడా ఏకంగా డాన్స్ చేయడం మొదలు పెడుతున్నారు అని చెప్పాలి. ఇలా ప్రస్తుతం యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ చేసుకున్న పాటగా రికార్డులను సొంతం చేసుకోవడమే కాదు.. ఎంతోమంది మదిని దోచేస్తూ అందరినీ ఉర్రూతలూగిస్తుంది ఈ పాట.



అయితే ఇక నాటు నాటు పాట వినిపిస్తే చాలు కుర్రాల్లు మొత్తం ఏం పని చేస్తున్న కూడా డాన్స్ చేయడం మొదలు పెడుతున్నారు. కేవలం కుర్రకారు మాత్రమే కాదు ఇక ఇక్కడ ఒక బామ్మ కూడా ఏకంగా నాటు నాటు పాట వినిపూనకం వచ్చినట్లుగా డాన్స్ చేయడం మొదలు పెట్టింది. ఈ వీడియోకి అర్థం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నాటు నాటుపాట పై అదిరిపోయే స్టెప్పులు వేసిన బామ్మ మాత్రం అలసిపోకుండా డాన్స్ చేసింది. ఇక ఈ వీడియోను ఎవరో కాదు ఏకంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం గమనార్హం.. ఈ భామకు ఈ వయసులో ఇంత ఉత్సాహమా అని ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: