ఇక మీదట రాబోయే తరాల వాళ్ళు విశాఖపట్నాన్ని చూడ లేరట.. అది చూద్దాం అన్నా కూడా కనిపించదట, అందుకు ముఖ్య కారణం అది సముద్రంలోకి కలిసిపోతోంది అన్నట్లుగా సమాచారం. ఇవి కొంత మంది చెప్పిన వ్యక్తుల మాటలు కాదు.. ఎంతోమంది నిపుణులు అధ్యయనం చేసిన తరువాత దీనిని కనుగొన్నారట. అందుకు ముఖ్య కారణం ఏమిటంటే ప్రస్తుతం సముద్రపు కోతలు, సముద్రం లో జరిగే టువంటి కొన్ని పరిణామాలు అని చెప్పవచ్చు. జాతీయ సముద్ర విజ్ఞాన కేంద్రం వారు.. 40 సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని తెలియజేశారు.

వాతావరణ కాలుష్యాల వల్ల వాతావరణంలో జరిగే మార్పులతో  సముద్రపు జలాలు ఎక్కువ శాతం పెరిగి పోయాయట.. అందుచేతనే దేశంలో ఉండే కొన్ని తీర ప్రాంతాలు మునిగిపోతాయని తెలియజేశారు. ఇక అలాంటి లిస్టులో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విశాఖపట్నం సిటీ కూడా ఉన్నది. అయితే సముద్రం అలా ఎంత ముందుకు వస్తే ఏ ఏ ప్రాంతాలు నీట మునుగుతాయో ఒకసారి తెలుసుకుందాం.

ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు కానీ.. దాదాపుగా 60 నుంచి 80 సంవత్సరాల తరువాత విశాఖపట్నం చెదిరిపోయే అవకాశం  ఉన్నది. ప్రతి సంవత్సరం సముద్రపు జలాల ఎత్తు..0.2 సెంటీమీటర్లు నుంచి 0.5 సెంటి మీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ ఉన్నదట.. కానీ ప్రస్తుతం 0.6 సెంటి మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుందట. రాబోయే రోజుల్లో ఇంకా 2  సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.


2050 వ సంవత్సరం తర్వాత సముద్రపు చుట్టుకొలతలు పెరుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా , ఉష్ణోగ్రతలు ఎక్కువై మంచు కరగడం వల్ల ఆ నీరు సముద్రంలోకి కలిసి వాటి మట్టాన్ని పెంచుతాయట.  అలా పెరిగే అవకాశం ఎక్కువగా మంగళూరు, చెన్నై, విశాఖపట్నం, ముంబై, పారాదీప్, ట్యూటీకొరిన్, ఖదీర్ పూర్ . వంటి నగరాలు ఎక్కువగా సముద్రంలో కలవనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: