పానిపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరెమో.. అన్నీ రకాల రుచులను కలిగి ఉంటుంది. చిన్న పిల్లలు నుంచి పెద్ద పిల్లలు వరకు అందరూ ఇష్టంగా తింటారు. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ. నార్త్ ఇండియాలో పుట్టిన ఈ పానిపూరి ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది. వీటిని ఎక్కువగా చేతులతో చేస్తారు. నీళ్ళు కూడా వుంటాయి. ఆరోగ్య దృష్ట్యా ఇవి మంచిది కాదు అని ఆహార నిపుణులు అంటున్నారు. కానీ జనాలు మాత్రం వినడం లేదు. అయితే పానీపూరి  కి కరోనా సమయం లో కూడా మంచి డిమాండ్ వుంది.


ఈ పానీపూరి రుచిని మాత్రమే కాదు.. గొడవలను కూడా పెడుతోంది. రుచి బాగుంటేనె అందరూ ఇష్టంగా తింటారు. కానీ, కొన్ని చొట్ల రుచి బాగుందన్న విషయం అందరికి తెలిసిందే. అలాంటి చోటు లో కొందరు పానిపూరి ప్రియులు ఘర్షనకు దిగుతున్నారు. కొన్ని సింపుల్ గా మాటల తో సర్దు మనిగితే, మరి కొన్ని మాత్రం అనేక వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇప్పుడు కూడా పానిపూరి గొడవ పోలీసులకు తలనొప్పిగా మారింది. ఓ వ్యక్తి పానిపూరి రుచిగా లేదని నిర్వాహకుడు తో ఘర్షనకు దిగాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.


వివారాల్లొకి వెళితే.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ లో వెలుగు చూసింది.పోలీసు కాంప్లెక్స్‌లో రాణి అనే మహిళ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. బెంగళూరులో ఎంబీబీఎస్‌ చదువుతున్న రాంనగర్‌ నివాసి వెంకటకృష్ణారెడ్డి అనే వ్యక్తి పానీపూరి తినడానికి వచ్చాడు. తమ్ముడి తో కలిసి వచ్చి రాణి దగ్గర పానిపూరి తిన్నారు.తిన్న తర్వాత రుచి బాగోలేదని తన అభిప్రాయాన్ని ఆ యువకుడు వ్యక్తం చేశాడు. అది నచ్చని ఆమె అతనితో గొడవకు దిగింది. ఇద్దరు మాటల యుద్ధం మొదలు పెట్టారు. ఈ సమయంలో అక్కడున్న వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చెరుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు.. మొత్తానికి ఈ వివాదం కాస్త పోలీసులకు తల నొప్పిగా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: