ఈ రోజుల్లో చదువును మించిన తెలివి తేటలను పిల్లలు ప్రదర్షిస్తూన్నారు.. కొన్నింటినీ చూస్తే ఎవరైనా షాక్ అవ్వక మానరు. వాళ్ళకు వున్న తెలివి ఎవరికీ ఉండదు. అందుకే అంటారు ఇప్పుడు ఉన్న పిల్లల తెలీవి ముందు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెస్ట్ అని. అయితే అది పనికొచ్చే వాటికి కాకుండా పనికి రాని వాటికి ఉపయొగిస్తున్నారు. అవి ఒక్కోసారి బయట పడటం తో అందరికి షాక్ అవుతూన్నారు. ఇప్పుడు ఒక విద్యార్థి తెలివికి అందరూ ఫిధా అవ్వాల్సిందే.. తన గర్ల్ ఫ్రెండ్ ను తన రూమ్ కు తీసుకెల్లాడానికి భలే ప్లాను చేశాడు. చివరికి కాలేజ్ సెక్యురిటి దగ్గర చెకింగ్ లో అడ్డంగా దొరికి పోయాడు..



వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన కర్ణాటక లో వెలుగు చూసింది.కర్ణాటక మణిపాల్‌ హాస్టల్‌లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థి.. అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినితో ప్రేమాయణం సాగిస్తున్నాడు.రాత్రి ఆమెను తన గదికి తీసుకెళ్లాలని ప్లాన్‌ వేశాడు.ఓ పెద్ద ట్రాలీ బ్యాగులో ఆమెను కుక్కేసి.. హాస్టల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏం ఎరగనట్లు వెళ్తున్న అతనిపై హాస్టల్‌ వార్డెన్‌కు అనుమానం వచ్చింది. అంతపెద్ద లగేజ్‌ ఏంటని ప్రశ్నించాడు.. 

ఏవేవో సాకులు చెప్పాడు.. అవి పొంతన లేకపోవడం తో అనుమానం బలపడింది. 



ముందుగా ఆన్ లైన్ లో చేసిన వస్తువులు అని చెప్పాడు. ఆ తర్వాత బుక్స్ అని చెప్పాడు. అవి నమ్మషక్యంగా లేకపోవడం తో అతను ఓపెన్ చేయాలనీ కోరాడు..పగిలిపోయే ఐటెమ్స్‌ ఉన్నాయని, వద్దని రిక్వెస్ట్‌ చేశాడు. అయినా కుదరదని బలవంతంగా ఆ ట్రాలీ బ్యాగ్‌ జిప్‌ ఓపెన్‌ చేయడంతో.. అందులోంచి ఆ కుర్రాడి గర్ల్‌ఫ్రెండ్‌ బయటకు వచ్చింది. దాన్ని సీరియస్ గా తీసుకున్న వార్దెన్ అతణ్ణి గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని చెప్పాడు. కరోనా కారణంగా దూరంగా వున్నట్లు తెలిపాడు..ఇద్దరూ ఒకే కాలేజ్ స్టూడెంట్స్ కావడంతో ఇద్దరినీ సస్పెండ్ చేశారు. గతంలో ఇలాంటి ఘటన ఒకటి మంగలూరు లో వెలుగు చూసింది.కలికాలంలో ఇలాంటివి జరగడం ఆశ్చర్యం అనే చెప్పాలి..
 

మరింత సమాచారం తెలుసుకోండి: