దాదాపు రెండు రోజులపాటు తిండి, నిరు లేకుండా చచ్చిపోతానని భయం.. బతకాలని ఆశ అతనిని బతికించింది.. కేరళ ప్రాంతంలోని పలక్కడ్ ప్రాంతంలో ఒక ట్రెక్కర్ పరిస్థితి ఇది.. చావు బతుకుల మధ్య ఇరుక్కున్న అతనిని సేఫ్ చేయడం కోసం గతంలో ఎన్నడూ చూడని విధంగా, ఒక భారీ రెస్యూ జరిగింది. దీంతో ఆ వ్యక్తి బతికి బయట పడ్డాడు. దాదాపుగా చావుకీ బతుక్కీ మధ్య 40 గంటలపాటు పోరాడాడు.. ఒక కొండపై నుంచి జారి 400 అడుగుల్లో చిక్కుకుపోయాడు ఆ వ్యక్తి.. అలా జారి పడిన వ్యక్తికి కింది వైపుగా ఆరు వందల అడుగుల పాతాళం, పైకి వెళ్లాలంటే 400 అడుగులు ఎత్తు.. ఇలా మధ్యలో ఉన్నాడు.

ఇక కింద పడితే తనకి ప్రాణాలు మిగులుతాయి అన్న గ్యారెంటీ లేదు. అయితే అక్కడే ఉన్న ఒక లోకల్ రెవెన్యూ టీమ్స్, ఆర్మీ, కోస్ట్ గార్డ్, ఎయిర్ ఫోర్స్.. లో ఉండే వందలాది మంది ఉద్యోగస్తులు ప్రయత్నించారు.. కానీ అయిన గ్యారెంటీగా చెప్పలేదు వారు.. ఇక కష్టమే అనుకున్న సమయంలో ఎట్టకేలకు ఆ వ్యక్తి బతికి బయట పడ్డాడు. అది కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీంతో అతన్ని క్షేమంగా భూమి మీదికి తీసుకురాగలిగింది.



మలమ్ పూజలో ఉండే బాబు అనే వ్యక్తి.. తన స్నేహితులతో కలిసి ఈ నెల 7వ తేదీన కురుంబాచి అనే కొండపైకి ట్రెక్కింగ్ కి వెళ్ళాడు.. వెళ్లేటప్పుడు ఎంతో జోష్ గా  వెళ్లిన వచ్చేటప్పుడు కాలుజారి స్లిప్ అయి కొండ పై నుంచి జారిపడ్డ జరిగిందట. అలా పడిన బాబు బతికి ఉండటం గమనార్హం. కానీ లక్కీగా పూర్తిగా నేల మీద పడకుండా మధ్యలోనే నిలిచిపోయాడు. ఈ కొండ వాగుల్లో చిక్కుకున్న కొండపైన నుంచి చూసిన స్నేహితులు తన ఫ్రెండు చనిపోయాడు అనుకునే.. లోపు ఆ వ్యక్తి దగ్గర నుంచి మెసేజ్ రావడం గమనించారు. అయితే ఆ ఇద్దరి స్నేహితుడు బాబు ని కాపాడడానికి ప్రయత్నించిన వీలు కాలేదు. ఇక ఆ తర్వాత అక్కడ ఉన్న రెవెన్యూ టీమ్ తో బాబు ని బయటికి తీయడం జరిగింది ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: