భారత్ సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పెళ్లి చేసుకునే విషయంలో అయితే ఎన్నో సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు మన దేశంలో. అందుకే విదేశీయులు సైతం భారత సంప్రదాయంలో పెళ్లి చేసుకోడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పెళ్లి అంటే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబ సభ్యులు బంధు మిత్రులు శ్రేయోభిలాషులు మధ్య ప్రతి ఒక్కరూ ఘనంగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. పెళ్లి అంటే కేవలం వధూవరులిద్దరు మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్య కూడా బంధం ఏర్పడుతుంది.


 అందుకే పెళ్లి అంటే ఎంతో సంతోషంగా జరుగుతూ ఉంటుంది. అందరి ముఖాల్లో నవ్వు వెల్లివిరుస్తూ  ఉంటుంది. అయితే పెళ్లి జరుగుతున్న సమయంలో ఎంతో సంతోషంగా ఉన్న వధువు పుట్టింటి ని వదిలి మెట్టినింటికి  వెళ్తున్న సమయంలో మాత్రం ఏడుస్తూ ఉంటుంది.. తన తల్లిదండ్రులను వదిలి వెళ్తున్న సమయంలో కన్నీటి పర్యంతం అవుతూ ఉంటుంది. కానీ ఏకంగా పెళ్లి వేడుకలో వరుడు ఏడవడం ఎప్పుడైనా చూసారా ఇక్కడ జరిగిన పెళ్లి వేడుకలో మాత్రం వధువు తోపాటు వరుడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది ఎంతో ప్రత్యేకం. వారు కోరుకున్నట్టుగానే పెళ్లి జరుగుతుంది అంటే ఇక సంతోషం మాటల్లో చెప్పలేకుండా ఉంటుంది.



 సంతోషం కొన్ని కొన్ని సార్లు ఆనందభాష్పాలుగా కూడా వస్తూ ఉంటాయి. దీనికి సాక్ష్యం ఇక వైరల్ గా మారిపోయిన వీడియో నే. వరుడు తన సన్నిహితులతో కలిసి పెళ్లి మండపం లో అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే వధువు డాన్స్ చేస్తూ పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక వధువును చూడగానే వరుడు ఆనందంలో ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించాడు.ఆ తర్వాత వరుడు దగ్గరికి వచ్చిన తర్వాత వధువు కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ సన్నివేశంతో చూసి అక్కడున్న వారందరూ కూడా ఎమోషన్ అయ్యారు. ఇక ఈ వీడియో ఆటో నెటిజన్ల అందర్నీ కూడా ఫిదా చేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: