దీంతో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విద్యార్థులు గొడవ పడుతున్న వీడియోలు వైరల్ గా మారిపోతున్నాయి. విద్యార్థుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు ఏకంగా గ్యాంగ్ వార్ గా మారిపోయి ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటున్నారు. నడిరోడ్డు లో జనాలు మొత్తం మననే చూస్తున్నారు అనే ఆలోచన కూడా లేకుండా కింద మీదా పడుతూ దారుణంగా గొడవ పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. కేవలం యువకులు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా ఇలా ఇటీవలి కాలంలో రోడ్డుపైనే ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకున్న వీడియోలు అందరినీ అవాక్కయ్యేలా చేసాయ్ అన్న విషయం తెలిసిందే.


 ఏంటో అమ్మాయిలు ఈ మధ్యకాలంలో ఇలా గొడవలలో కూడా తమ అబ్బాయిలకు ఎక్కడా తీసిపోమని గొడవలకు దిగుతూ ఉండడం గమనార్హం. ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి రాక రాగా.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. దీంతో ఇక కౌన్సిలింగ్ కు తగ్గ చర్యలపై విద్యా శాఖ దృష్టి పెట్టడం గమనార్హం. తిరునెల్వేలి లో విద్యార్థుల గొడవలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను ఎంతో తీవ్రంగా పరిగణించింది విద్యాశాఖ. కడలూరు లో శుక్రవారం గొడవ పడ్డ 14 మంది విద్యార్థులపై కేసులు కూడా నమోదు కావడం గమనార్హం.


 సరిగ్గా సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో విద్యార్థులు తగ్గేదే లేదు అన్నట్లుగా  దారుణంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారి పోవడం తో అందరూ అవాక్కవుతున్నారు. ఇక కొంతమంది విద్యార్థులు గొడవ పడలేక పారిపోతున్న కూడా వెంటాడి మరీ మరికొందరు విద్యార్థులు కొట్టడం గమనార్హం. ఇక ఇదంతా పక్కనే ఉన్న విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిపోయింది. సదరు విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారిగా గుర్తించారు.ఈ ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: