సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో మారుమూల జరిగిన ఘటనలు కూడా కేవలం క్షణకాల వ్యవధిలో  అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలి పోతున్నాయి అన్న  విషయం తెలిసిందే. ఇక ఎన్నో రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయ్.  ఇక ఇలా వెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురి చేస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా విమానంలో ప్రయాణిస్తున్న వారు ఎప్పుడూ ఎంతో హుందాగా నడుచుకుంటారూ. ఒకరితో ఒకరు గొడవ పడటం లాంటి అస్సలు చేయరు అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రయాణికుల మధ్య పొరపాటున ఏదైనా గొడవ తలెత్తిన వెంటనే ఆ గొడవ సద్దుమణిగేలా చేయడానికి అక్కడ పోలీసులు అధికారులు కూడా ఉంటారు.


 కానీ ఇక్కడ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రం దారుణంగా కొట్టుకున్నారు. బస్తీలో కుస్తీ పట్టినట్లుగా విమానంలో లో ఒకరి మీద ఒకరు పడి మరి కొట్టుకున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ గొడవ నేపథ్యంలో విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. అయితే ఏకంగా ఆరుగురు ప్రయాణికులు కలిసి మరో ప్రయాణికుడి పట్ల జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో వాగ్వాదం చెలరేగింది. మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.


 కాగా ఈ గొడవ చూసిన పైలెట్ అక్కడున్న సిబ్బంది వారిని నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా చివరికి ఫలితం లేకుండా పోయింది. ఏకంగా కాసేపటి వరకు అలాగే కుస్తీలు పట్టుకున్నారు.  ఇదంతా వీడియో తీసిన ఒక ప్రయాణికుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇక ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.  విమానం లో గొడవ జరిగింది నిజమేనని ఆరుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని  సంబంధిత  అధికారులు ఇక ఈ వీడియోపై వివరణ ఇవ్వడం గమనార్హం. ఏదేమైనా ఇక విమానంలో ప్రయాణికుల మధ్య కొట్లాట మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: