ఎన్నో నెలల పాటు ఎంతో చెమటోడ్చి ప్రత్యేకమైన డైట్ ఫాలో అయ్యి జిమ్ లో కసరత్తు చేస్తే సిక్స్ ప్యాక్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో సిక్స్ చేయాలని జిమ్‌కు వెళ్లడం కొన్నాళ్ల పాటు కష్టపడి ఇక ఆ తర్వాత వర్కౌట్స్ వదిలేయడం లాంటివి చేస్తున్నారు నేటి రోజుల్లో యువత. కఠినమైన డైట్ పాటించకుండా జిమ్ లో చెమట చిందించకుండా సిక్స్ ప్యాక్ పొందడం సాధ్యమేనా అంటే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం అవును అని అంటున్నాడు. అంతే కాదు కేవలం రెండు రోజుల్లోనే జిమ్ కు వెళ్ళకుండా సిక్స్ ప్యాక్ పొందాడు.
బ్రిటన్‌లోని మాంచెస్టర్ కు చెందిన ఒక వ్యక్తి ఊబకాయంతో బాధపడుతున్నాడు. సిక్స్ ప్యాక్ చేయాలనుకుని భావించి జిమ్‌కు వెళ్లే ట్రైనర్ చెప్పినట్లుగా కొన్ని నెలలపాటు వర్క్ ఔట్ చేశాడు. కానీ ఆ వర్కౌట్లు అతని వల్ల కాదు అని అర్థమైంది. దీంతో సరికొత్త ఆలోచన చేశాడు. అతని పేరు డీన్ గుంథర్. టాటూ వేయాలని సిక్స్ ప్యాక్ లాగా ఉండాలి అంటూ చెప్పాడు. ఈ క్రమంలోనే అతను చెప్పినట్లుగానే టాటూ వేశారు. అయితే దీని కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ ప్రాజెక్టుగా చేపట్టాడట టాటూ చేసే వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..