బుల్లితెరపై ఎన్ని కార్యక్రమాలు వస్తున్న ఆటో డాన్స్ కార్యక్రమాలకు మాత్రం ఎందుకో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ కార్యక్రమాలలో కంటెస్టెంట్ లు చేసే డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి ఎంతో మంది మెరిసి పోతూ ఉంటారు. ఇక ఎవరైనా తమకు మనసుకు నచ్చే విధంగా డాన్స్ చేస్తే అబ్బా ఎంత బాగా డాన్స్ చేస్తారో అంటూ ఎంతో మురిసిపోతూ వుంటారు.  కేవలం డాన్స్ కు సంబంధించిన బుల్లితెర కార్యక్రమం లోనే కాదు అటు కాలేజీ ఈవెంట్ లలో కూడా విద్యార్థులు చేసే డాన్సులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందరి కంటే భిన్నంగా కాస్త కొత్తగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం చేస్తూ ఉంటారు.


 అయితే ఇప్పటివరకూ ఎంతోమంది ఇలా కాలేజ్ ఈవెంట్స్ లో ఎంతో అద్భుతంగా భరత నాట్యం చేసి తమ హావభావాలతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసిన వారు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో ఇక వెస్టర్న్  డాన్సులు చేస్తూ అదరగొట్టిన వాళ్లు కూడా ఇంకా ఎంతోమంది ఉన్నారు. కానీ భరతనాట్యం వెస్టర్న్ డాన్స్ కలిపి చేస్తే ఇక అది చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పాలి. ఇలా చేయడం కూడా చాలా కష్టమే. కాగా ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు ఇలాంటి అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి చూపించారు. భరతనాట్యం, హిప్-హాప్ రీమిక్స్ తో ముగ్గురు అమ్మాయిలు అదరగొట్టేసారు.


 ఈ ముగ్గురు అమ్మాయిలు అదిరిపోయే పర్ఫామెన్స్ కు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ మారిపోయింది.  అయితే ఈ ప్రత్యేకమైన డాన్స్ ఉషా జై అనే యువతి కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోలో చూసుకుంటే ఒకవైపు శాస్త్రీయ సంగీతానికి నృత్యం చేస్తున్న అమ్మాయిలు మధ్య మధ్యలో హిప్-హాప్ మ్యూజిక్స్ కి రీమిక్స్ చేసి అదిరిపోయే స్టెప్పులు వేసి ఇరగదీశారు. ఈ క్రమంలోనే ఉషా జై చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో చూసి వావ్ సూపర్ అమేజింగ్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: