సాధారణంగా పోలీసులను చూస్తే ఎంతో మంది భయపడిపోతుంటారు అన్న విషయం తెలిసిందే. ఎలాంటి నేరం చేయకపోయినప్పటికీ ఎందుకొ పోలీస్ ను చూస్తే చాలు ఏదో తెలియని భయం మనసులో కలుగుతూ ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని తెలుస్తోంది. అందరినీ కాపాడే పోలీసులపైనే కొంతమంది దారుణంగా దాడి చేస్తున్న సంఘటనలు ఎంతోమందిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇంకొంతమంది రెచ్చిపోయి ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే దాడులకు పాల్పడుతూ ఉండటం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.


 అందరు చూస్తుండగానే ఓ పోలీస్ కానిస్టేబుల్ పై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు కొంతమంది వ్యక్తులు. అంతేకాదు ఇక ఇలా కానిస్టేబుల్ పై దాడి చేసి సెల్ఫోన్ లో చిత్రీకరించి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ఇలా మూకుమ్మడిగా తన పై దాడి చేయడంతో తనను వదిలేయాలి అంటూ ఆ పోలీస్ చేతులెత్తి మొక్కిన కూడా ఎక్కడా కనిపించలేదు. ఏకంగా చెంపదెబ్బలు కొడుతూ పిడిగుద్దులు కురిపిస్తూ దారుణంగా దాడి చేశారు అని చెప్పాలి. ఈ ఘటన న్యూఢిల్లీ ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్ లో జరిగింది అని తెలుస్తోంది. దాదాపు 10 నుంచి 12 మంది కానిస్టేబుల్ చుట్టూ చేరి దారుణంగా చితకబాదారు.


 అయితే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఈ గొడవను  ఆపక పోగా ఏకంగా సెల్ఫోన్లో చిత్రీకరించడం గమనార్హం. అయితే ఇలా దెబ్బలు తిన్న బాధితుడు పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే క్షమించి వదిలేయాలి అని కానిస్టేబుల్ ఎంత వేడుకున్నా అతనిపై దారుణంగా దాడి చేయడం కూడా ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారి పోవడం తో ఏకంగా ఉన్నతాధికారులు కూడా స్పందించారు. కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అంటూ ఆదేశాలు జారీ చేశారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: